
పొందూరు ఏఎఫ్‌కేకేకు సువర్ణావకాశం
శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కేవీఐసీ సుముఖం
అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ
శ్రీకాకుళం, పొందూరు: వేసవిలో చల్లదనం.. శీతాకాలంలో వెచ్చదనం ఇవ్వడం పొందూరు ఖాదీ వ్రస్తాల ప్రత్యేకత. ఈ దుస్తులు ఎంతో సౌకర్యవంతంగా, హుందాగా ఉంటాయి. అతి సామాన్యుల నుంచి ఉన్నతవర్గాల వరకూ ప్రతి ఒక్కరూ ధరించేందుకు వీలుగా అందుబాటు ధరల్లో లభిస్తాయి. మహాత్మాగాంధీ నుంచి ప్రస్తుత రాజకీయ నాయకుల వరకు ఎంతోమంది పొందూరు ఖాదీకి అభిమానులు ఉన్నారు. ఈ ఫైన్ ఖాదీ(సన్నఖాదీ) తయారీకి ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే పండించే కొండ పత్తిని ఇక్కడ ఉపయోగిస్తారు. దశాబ్ధాల కాలం నుంచి పొందూరు ఏఎఫ్‌కేకే సంఘం అనేది ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్(కేవీఐసీ) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ సంఘాన్ని కేవీఐసీ సౌత్‌జోన్ డిప్యూటీ సీఈవో మదన్‌కుమార్ రెడ్డి ఇటీవల సందర్శించారు. దీనిలో భాగంగా సంప్రదాయ ఖాదీ వ్రస్తాల తయారీ కేంద్రం మరిన్ని కాలాలు విరజిల్లాలని ఆకాంక్షిస్తూ తన పరిధిలో హామీలనిచ్చారు. ఖాదీ ప్రమోషనల్ గ్రాంట్ నుంచి అవసరమైన పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. వర్క్òÙడ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నామని, పొందూరు ఏఎఫ్‌కేకే సంఘంతో కేవీఐసీ కలిసి కొత్తగా నైపుణ్యాలపై శిక్షణా కేంద్రం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కేవీఐసీ, జీఎంఆర్ సంయుక్తంగా విలేజ్ ఇండస్ట్రీస్ కింద శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. ఖాదీని ముందు తరాలకు అందించేందుకు ఆ అవకాశాన్ని పొందూరు ఏఎఫ్‌కేకే సంఘం దక్కించుకోవాలని సూచించారు.

శిక్షణతో ఉపాధి
చేనేత వస్త్ర తయారీలో శిక్షణ ఇవ్వడం వలన నిరుద్యోగులకు ఉపాధి చేకూరుతుంది. నెలకు దాదాపు రూ.15 వేలు నుంచి రూ.25 వేలు వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. స్పిన్నింగ్, వీవింగ్‌లో శిక్షణ పొందిన వారంతా సంఘాలకు, సొసైటీలకు దుస్తులు నేస్తూ ఉపాధి పొందుతారు. వాస్తవానికి స్పిన్నర్లు, వీవర్లు, సంఘం ఉద్యోగులకు ఆదాయం పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. కేవీఐసీ ఎండీఏ సిస్టంలో ఉత్పత్తిపై 35 శాతం మొత్తాన్నిప్రతీ మూడు నెలలకు ఒకసారి స్పిన్నర్లు, వీవర్లు, ఉద్యోగులకు అందిస్తుంది. ఇదేకాకుండా సంఘాలు మజూరీని అందజేస్తున్నాయి. కొత్త కార్మికులు సంఘంలో చేరి దుస్తులు నేస్తే మరింత ఆదాయం పొందే అవకాశం మెండుగా ఉంది.
సొసైటీలకు సహకారం అందాలి
అయితే వాస్తవానికి సొసైటీలు, సంఘాలకు దుస్తులు నేసే వారికంటే మాస్టర్ వీవర్స్ దగ్గర ఎక్కువ కార్మికులు ఉండడం గమనార్హం. మాస్టర్ వీవర్స్ నేసే వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. సొసైటీలు, సంఘాలకు నేసేవారికి ప్రభుత్వ సహకారం అందించాలి. ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి. ఉచిత విద్యుత్, ఆరోగ్య బీమా, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ వంటివి సౌసైటీలు, సంఘాలకు నేసే కారి్మకులకు వర్తింపజేయాలి. దుస్తులు నేసే వారికి షరతులు ఉండకూడదు. ఉదాహరణకు పొందూరు ఏఎఫ్‌కేకే సంఘంలో ఏఎంసీ, ఎన్‌ఎంసీ వ్రస్తాలు మాత్రమే లభిస్తున్నాయి. సీమనూలుతో నేసే వ్రస్తాల తయారీ ఇక్కడ లేదు. అందువలన ఏరకమైన నూలుతోనైనా వ్రస్తాలు తయారు చేయోచ్చన్న అనుమతి కేవీఐసీ నుంచి రావాలి. తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. కారి్మకులకు ఆదాయం పెరుగుతుంది. కొత్తవారు ఈ రంగంలోకి వచ్చేందుకు మొగ్గు చూపుతారు.
సమయం ఆసన్నమైంది.
అంతరించిపోతున్న ప్రాచీన, సంప్రదాయ వస్త్ర తయారీ ప్రక్రియను బతికించేందుకు ఏఎఫ్‌కేకే సంఘం వడుకు, నేత ప్రక్రియలను నేర్పే శిక్షణా సంస్థగా అవతరించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆ మేరకు ఏఎఫ్‌కేకే సంఘం త్వరగా కేవీఐసీ సాయంతో శిక్షణలు ఇచ్చేందుకు భాగస్వామ్యం కోసం అడుగులు వేయాలి. పొందూరులో గతంలో 1,200 మంది స్పిన్నర్లు ఉండేవారు. ప్రస్తుతం వారి సంఖ్య 520 మందికి చేరింది. గతంలో 300 మంది నేత కార్మికులు ఉండేవారు. ప్రస్తుతం కేవలం 80 కుటుంబాలు మాత్రమే నేత కారి్మకులుగా మిగిలారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ కార్మికులు తగ్గిపోతున్న నేపథ్యంలో కొత్తవారు ఈ రంగంలోకి రావాల్సిన అవసరం ఏర్పడింది. దీనికోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం
కేవీఐసీ డిప్యూటీ సీఈవో మదన్‌మోహన్‌రెడ్డి పొందూరు ఏఎఫ్‌కేకే సంఘాన్ని సందర్శించి హామీలివ్వడం వాస్తవమే. కొత్తవారికి వడుకు, నేత ప్రక్రియలపై శిక్షణలు ఇచ్చేందుకు కేవీఐసీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణలిచ్చేందుకు ఏఎఫ్‌కేకే సంఘం సిద్ధంగా ఉంది. – దండా వెంకటరమణ, సెక్రటరీ,ఏఎఫ్‌కేకే సంఘం, పొందూరు
అనుమతులిస్తాం
ఖాదీ వ్రస్తాలు తయారు చేసేందుకు పొందూరు ఏఎఫ్‌కేకే సంఘాన్ని కేవీఐసీతో ట్రైనింగ్ పార్టనర్‌గా ఉండమని సూచించాం. పొందూరు ఖాదీని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనివలన కొత్తతరం వారు ఈ వృత్తిలో కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా వడుకు, నేత ప్రక్రియలో శిక్షణ ఇచ్చేందుకు పొందూరు ఖాదీ సంస్థకు దరఖాస్తు చేయమని చెప్పాను. శిక్షణ ముగించుకున్న వారికి సరి్టఫికెట్లు సైతం అందజేస్తాం. ఏ జిల్లా నుంచైనా శిక్షణలకు పొందూరుకు రావచ్చు. వడుకు, నేత పని నేర్చుకోవచ్చు. – మదన్‌కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఈవో,బెంగుళూరు, కేవీఐసీ