నటి లావణ్య త్రిపాఠి లుక్‌ని యంగ్‌గా చూపించే ఫ్యాషన్‌ సీక్రెట్స్‌ ఇవే..! | Fashion Tips: Lavanya Tripathi Stylish Outfits And Looks | Sakshi
Sakshi News home page

నటి లావణ్య త్రిపాఠి లుక్‌ని యంగ్‌గా చూపించే ఫ్యాషన్‌ సీక్రెట్స్‌ ఇవే..!

Sep 14 2025 7:23 AM | Updated on Sep 14 2025 9:02 AM

Fashion Tips: Lavanya Tripathi Stylish Outfits And Looks

స్టయిల్‌కి ఒక ఫ్రెండ్, సింపుల్‌ బ్యూటీకి ఒక సీక్రెట్‌ ఉంటే అది లావణ్య త్రిపాఠీనే! ఎక్కడ చూసినా ఆమె చిన్న చిరునవ్వు, సాఫ్ట్‌ గ్లో కలసి తన మొత్తం లుక్‌ను నెక్ట్స్‌ లెవెల్‌కి తీసుకెళ్తాయి. చిన్న స్టడ్స్, మినిమల్‌ జ్యూలరీ నా ఫేవరెట్‌. అవే నా పర్సనాలిటీని బెస్ట్‌గా రిఫ్లెక్ట్‌ చేస్తాయి. కొన్నిసార్లు ఒక్క స్టేట్‌మెంట్‌ పీస్‌ చాలు, లుక్‌ మొత్తం ఎలివేట్‌ అవుతుంది. డ్రెస్‌లలో పేస్టల్‌ షేడ్స్, సాఫ్ట్‌ కలర్స్‌నే నేను ఎక్కువగా ఎంచుకుంటాను. ఇవి నన్ను ఎప్పుడూ ఫ్రెష్‌గా, యంగ్‌గా చూపిస్తాయని అంటుంది లావణ్య త్రిపాఠి. ఇక్కడ లావణ్య ధరించిన డ్రెస్‌ బ్రాండ్‌  ఇస్సా స్టూడియో. ధర: రూ. 19,500, జ్యూలరీ 
బ్రాండ్‌: రియా, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

చెవిపోగుల బాస్‌!
అమ్మాయిల అలంకరణకు ప్రాణం పోయడానికి పెద్ద పెద్ద ఆభరణాలు అవసరం లేదు, సరైన చెవిపోగులు ఉంటే చాలు. మొత్తం స్టయిల్‌నే మరో లెవెల్‌కి తీసుకెళ్తాయి. అలాంటి వాటిలో ముందుండేవి ఈ లాంగ్‌ డ్రాప్‌ స్టేట్‌మెంట్‌ ఇయర్‌ రింగ్స్‌. గోల్డెన్‌  టచ్‌తో మెరిసే స్టోన్స్, లేయర్‌ డిజైన్‌ , చూసే వారందరినీ ఆకట్టుకునే మెరుపు – ఇవన్నీ కలిపి ఒకేసారి రాయల్‌గా, మోడ్రన్‌ గా కనిపించేలా చేస్తాయి. 

పొడవుగా ఉండటం వలన ముఖాన్ని సన్నగా చూపిస్తాయి, ముఖానికి ఎలిగెన్స్‌ ఇస్తాయి. జుట్టు వెనక్కి కట్టుకున్నా, లైట్‌ వేవ్స్‌లో వదిలినా, ఈ ఇయర్‌రింగ్స్‌ మెరుపే మొదట కనిపిస్తుంది. డీప్‌ వీ నెక్‌ లేదా బోట్‌ నెక్‌ టాప్‌ వేసుకుంటే చెవిపోగులు ఇంకా క్లాసీగా మెరిసిపోతాయి. మేకప్‌ విషయానికి వస్తే షిమ్మరీ ఐలిడ్, లైట్‌ మస్కారా, న్యూడ్‌ లిప్‌ షేడ్‌ సరిపోతాయి. 

స్టేట్‌మెంట్‌ పీస్‌ కాబట్టి నెక్లెస్‌ అవసరం లేదు, సింపుల్‌ రింగ్‌ లేదా బ్రేస్‌లెట్‌ చాలు. వెడ్డింగ్, రిసెప్షన్‌ , ఫెస్టివల్‌ లేదా పార్టీ ఏ సందర్భంలో వేసుకున్నా ఈ చెవిపోగులు లుక్‌కి ఒక స్పెషల్‌ స్టన్నింగ్‌ టచ్‌ ఇస్తాయి. సింపుల్‌ డ్రెస్‌పైనా కూడా ఇవి వేసుకుంటే ఆటోమేటిక్‌గా గ్లామరస్‌గా, రాయల్‌గా మారిపోతారు. 

(చదవండి:  నూడుల్స్‌ తినడమే ఒక గేమ్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement