
భారతీయ బిర్యానీలలో టాప్ ఇవే...బిర్యానీ అంటే ఒక వంటకం కాదు, అది ఒక అనుభూతి. భారత దేశంలో అత్యధిక సంఖ్యలో భోజన ప్రియులు బిర్యానీని ఇష్టపడతారు. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే ఈ రుచికరమైన బిర్యానీ సువాసనగల బాస్మతి బియ్యాన్ని మ్యారినేట్ చేసిన మాంసం, కూరగాయలు సుగంధ ద్రవ్యాలతో తయారవుతుంది. గొప్ప రుచి సువాసనకు ప్రసిద్ధి చెందిన బిర్యానీ దక్షిణాసియాలో అత్యంత ప్రసిద్ధి చెందిన వంటకాల్లో ఒకటి, దీనిని రోజువారీ భోజనంలో పండుగ సందర్భాలలో రెండింటిలోనూ ఎంజాయ్ చేస్తారు.
పుట్టుక వెనుక...
బిర్యానీ అనే పదం పర్షియన్ పదం అయిన ‘‘బిరియన్’’ నుంచి పుట్టింది. ఈ పదానికి అర్థం ’వంటకు ముందు వేయించినది’. ఇదే బిర్యానీని ఇంగ్లీషులో మిక్స్‌డ్ రైస్ డిష్ అంటూ పేర్కొంటారు. దీనిని 16వ శతాబ్దంలో మొఘలులు భారతదేశానికి పరిచయం చేశారని నమ్ముతారు. కాలక్రమేణా, హైదరాబాదీ దమ్ బిర్యానీ నుంచి లక్నోయి అవధి శైలి వరకు వైవిధ్యాలు బిర్యానీకి ప్రాంతీయ పరిçమళాలు అద్దాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన వంట పద్ధతి సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో దేనికదే ప్రత్యేకత చాటుకుంటున్నాయిు. అయితే అన్నింట్లోనూ టాప్‌గా నిలుస్తోంది హైదరాబాదీ బిర్యానీయే.
సుగంధ ద్రవ్యాలు, కుంకుమ పువ్వు, కారామెలైజ్డ్ ఉల్లిపాయలు దమ్ వంట శైలికి ప్రసిద్ధి చెందింది. హైదరాబాదీ చికెన్ బిర్యానీతో పాటు ఆన్‌లైన్‌లో ఎక్కువగా శోధించిన బిర్యానీ వంటకాలలో హైదరాబాదీ మటన్ బిర్యానీ కూడా ఉంది.
ఆ తర్వాత స్థానంలో ఉంది లక్నోయి (అవధి) బిర్యానీ – మాంసం, బియ్యం సువాసనగల సుగంధ ద్రవ్యాలతో కలిపి దీనిని వండుతారు. ఈ అవధి బిర్యానీ శైలి తక్కువ కారం ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.
ఆ తర్వాతి స్థానంలో కోల్‌కతా బిర్యానీ నిలుస్తుంది. బంగాళాదుంపలు ఉడికించిన గుడ్లతో పాటు సువాసనగల బాస్మతి బియ్యం జోడించడంతో ఈ బిర్యానీ ప్రసిద్ధి చెందింది. కోల్‌కతా బిర్యానీలో సూక్ష్మమైన తీపి తేలికైన మసాలా మిశ్రమం ఉంటుంది, ఇది వెజ్ బిర్యానీ ప్రియులకు మాత్రమే కాదు నాన్–వెజ్ బిర్యానీ అభిమానులకు కూడా ప్రసిద్ధ ఎంపికగా నిలిచింది.
కేరళ రాష్ట్రపు మలబార్ బిర్యానీ కూడా భోజన ప్రియుల అభిమానాన్ని దక్కించుకుంటోంది. షార్ట్–గ్రెయిన్ జీరకాసల అనే బియ్యంతో తయారు అవుతుంది. కొబ్బరి, నెయ్యి తాజా మసాలాల కలయిక దీనికి కొత్త రుచులు అద్దుతుంది. మలబార్ చికెన్ బిర్యానీతో పాటు మలబార్ ఫిష్ బిర్యానీ కూడా బాగా పాప్యులర్.
పాకిస్తాన్‌లోని సింథ్ మూలాలు కలిగిన టాంగీ బిర్యానీ, పెరుగు, టమోటాలు, పచ్చిమిర్చి గాఢమైన మసాలాలతో వండుతారు. సింధీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రసిద్ధి చెందాయి,
మరోవైపు పాకిస్తాన్ వంటకంగా పేరొందిన ఆఫ్ఘని బిర్యానీ భారతీయ బిర్యానీలతో పోలిస్తే తక్కువ కారంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్, పప్పులు, తేలికైన మసాలా మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. పాకిస్తానీ బిర్యానీ, ఆఫ్ఘని చికెన్ బిర్యానీ కాబూలి పులావ్ మధ్యప్రాచ్యం మధ్య ఆసియాలో పేరొందాయి.