మనుషులే కాదు జంతువులు కూడా తమ ప్రాణాలు కోసం ఎంతలా పోరాడతాయనేందుకు ఈ ఘటనే నిదర్శనం. సినిమాని తలపించే ట్విస్ట్‌లు, ఛేజ్‌లతో ప్రమాదం నుంచి బయటపడ్డ ఈ పెంపుడు కుక్కల కథ వింటే..విస్తుపోతారు. అంతేగాదు ఇది నిజంగా జరిగిందా అని ఆశ్చర్యం కలుగకమానదు.
అసలేం జరిగిందంటే..చైనాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. చైనాలోని ఓ ఏడు పెంపుడు కుక్కలు..తమ ప్రాణాలను రక్షించుకోవడానికి చేసిన సాహనం నెట్టింట వైరల్‌గా మారి..అందర్నీ అమితంగా ఆకర్షించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..ఆ ఏడు కుక్కలు..కుక్కల మాంసం విక్రయించే కొందరు వ్యక్తుల ముఠా నుంచి చాలా తెలివిగా తప్పించుకున్నాయి. ఓ ట్రక్కు సాయంతో తీసుకుపోతున్న ఆ వ్యక్తుల బారీ నుంచి చాలా తెలివిగా బయటపడటమే కాకుండా..అవి ఒక బృందంగా వచ్చిన తీరు అమితంగా ఆకట్టుకుంటుంది.
ఆ కుక్కలను ఒకతాటిపై నడిపించేలే కోర్గి జాతీ కుక్క నాయకత్వం వహించగా మిగతా కుక్కలా దాని బాటలో నడవడం గమనార్హం. హైవేల మీదుగా..సుమారు 17 కిలోమీటర్లు నడిచి తమ ఓనర్ ఇంటికి నేరుగా వచ్చేశాయి. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అయితే వాటిలో ఒక జర్నమ్ షెపర్డ్ కుక్క గాయపడగా..దానికి రక్షణ కల్పించేలా గుంపుగా నిలబడి హైవేల గుండా జాగ్రత్తగా రోడ్డుదాటుతూ తమ ఇంటికి తిరిగి వెళ్లిపోవడం విశేషం. అయితే స్థానికులు మాత్రం అవన్నీ ఎక్కడకు వెళ్లినా..కలిసే వెళ్తాయని వెల్లడించడం గమనార్హం.
Seven dogs stolen from their owners have gone viral after escaping from an illegal transport truck and making their way home.
They traveled around 17 km together, led by a corgi across highways and fields, now safely back with their respective owners..🐶🐾🥺❤️ pic.twitter.com/H5VB9BQkGB— 𝕐o̴g̴ (@Yoda4ever) March 23, 2026
(చదవండి: పసిపాపతో ఆటో నడుపుతున్న మహిళ..!)


