పెళ్లి రోజే ఉద్యోగానికి దరఖాస్తు..! | Bride applies for job on wedding day, video goes viral | Sakshi
Sakshi News home page

పెళ్లి రోజే ఉద్యోగానికి దరఖాస్తు..!

Mar 24 2026 1:28 PM | Updated on Mar 24 2026 1:48 PM

Bride applies for job on wedding day, video goes viral

సోషల్‌ మీడియా పుణ్యామా కొన్ని హాస్యభరితమైన సన్నివేశాలు, సంఘటనలు క్షణాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇదేం విడ్డూరం అని అంతా అనుకునేలా ఆ ఘటనలు కాసింత ముఖంపై నవ్వులు మెరిపిస్తున్నాయి. అలాంటి ఫన్నీ వైరల్‌ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అదికూడా ఓ వధువుకి సంబంధించింది కావడంతో ఏమ్మా ఆ టైంలో కూడా ఇదేంటని అంతా తలోమాట అనుకునేలా చేసిన ఈ వీడియో చూస్తే నవ్వు ఆగదు.

ఈ వీడియోని సాంచి-శివం అనే దంపతులు నెట్టింట పంచుకున్నారు. ఆ వీడియలో వధువు పూర్తి పెళ్లి కూతురి దుస్తులో కారులో కూర్చొని కనిపిస్తుంది. ఆమె ఫోన్‌తో ఉద్యోగ దరఖాస్తు కోసం ఈమెయిల్‌ని పంపుతూ కనిపిస్తోంది. జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టం జరుగుతున్న రోజునే ఆమె ఈ పనిలో బిజీగా ఉండటం కాసింత ఆగ్రహం, నవ్వు తెప్పించేలా ఉంటుంది. 

కానీ ఆ వధువు మాత్రం పెళ్లి దుస్తుల్లో ఉండి కూడా చాలా ప్రశాంతంగా ఏకాగ్రతతో జాబ్‌కి దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఇది జీవితంలోని ముఖ్య ఘట్టాలను, వృత్తిపరమైన బాధ్యతలను సమన్వయం చేసుకోవడానికి తరుచుగా ఇబ్బందిపడే చాలామంది యువనిపుణులకు ఈ ఘటన ఓ చక్కటి సందేశానిచ్చేలా ఉంది కదూ.!. 

అంతేగాదు సాధారణంగా పెళ్లిళ్లు అంటే అట్టహాసమైన ఆచారాలు, వేడుకలతో ముడిపడి ఉన్నప్పటికీ..జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటనలలో కొన్నిసార్లు ఉద్యోగ బాధ్యతలు ఎలా ప్రాధాన్యత సంతరించుకుంటాయో ఈ క్లిప్‌ హాస్యభరితంగా చూపిస్తోంది. ఈ వీడియోకి "పెళ్లికూతురి మోడ్ ఆన్, హస్టల్‌ మోడ్ నెవర్ ఆఫ్" అనే క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేశారు. 

 

(చదవండి: పసిపాపతో ఆటో నడుపుతున్న మహిళ..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement