వైరల్‌ వీడియో.. కింగ్‌ కోబ్రాతోనే ఆటలా..? | Daring Snake Handler Captures Massive King Cobra Video Goes Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో.. కింగ్‌ కోబ్రాతోనే ఆటలా..?

Mar 24 2026 4:10 PM | Updated on Mar 24 2026 4:51 PM

Daring Snake Handler Captures Massive King Cobra Video Goes Viral

విష సర్పాలతో ఆటలు చాలా ప్రమాదకరం.  స్నేక్‌ క్యాచర్స్‌ కూడా పాములను పట్టే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన సందర్బాలు చాలానే ఉన్నాయి. అందులోనూ అత్యంత విష సర్పమైన  కింగ్‌ కోబ్రాను పట్టుకోవడం చాలా ప్రమాదం. ఇక్కడొక వ్యక్తి కింగ్‌ కోబ్రాను బంధించిన వైనం చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురౌవుతుంది. ఆ కోబ్రాను బంధించే క్రమంలో అది ఒకసారి చిక్కినట్లే చిక్కి మళ్లీ బుసలు కొట్టిన తీరు చూస్తే అమ్మో అనిపించకమానదు. 

అయినా చివరకు అత్యంత చాకచాక్యంగా ఓ గొట్టం సాయంతో దాన్ని బంధించాడు ఆ స్నేక్‌ క్యాచర్‌.   ఒక గొట్టం, ఒక సంచి సాయంతో  దాన్ని ఎట్టకేలకు పట్టుకున్నాడు. కనీసం చేతికి గ్లౌజ్‌లు కూడా లేకుండానే పట్టుకోవడం  ఇది చూసిన నెటిజన్లకు మరింత కలవరాన్ని కలిగించింది. 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఏమాత్రం అటు-ఇటు అయినా ఇక ఆ కోబ్రా నుంచి తప్పించుకోవడం కష్టమనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. 

కింగ్‌ కోబ్రా ఎంత ప్రమాదమంటే ఒకే కాటు ద్వారా  400–500 mg వరకు విషం ఇంజెక్ట్ చేయగల శక్తి ఉంటుంది. ఈ పరిమాణం 11 మంది మనుషులను లేదా ఒక ఏనుగును చంపగలదు అని శాస్త్రీయంగా నిర్ధారించబడింది కూడా. మరి అటువంటి కింగ్‌ కోబ్రాతో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పట్టుకోవడం ప్రాణం మీదకు తెచ్చుకున్నట్లే అవుతుందని నెటిజన్లు అంటున్నారు.

 


 

Advertisement
 
Advertisement
Advertisement