'స్పైడర్‌ విమెన్‌': జస్ట్‌ ఒట్టి చేతులతో అవలీలగా వంద మీటర్లు..! | Chinas Spider Woman Who Can Climb 108-Metre Cliff | Sakshi
Sakshi News home page

'స్పైడర్‌ విమెన్‌': జస్ట్‌ ఒట్టి చేతులతో అవలీలగా వంద మీటర్లు..!

Oct 11 2024 4:11 PM | Updated on Oct 11 2024 4:11 PM

Chinas Spider Woman Who Can Climb 108-Metre Cliff

మహిళలు పురుషులకు ఎందులోనూ తీసిపోని విధంగా అన్ని రంగాల్లో రాణించి చూపిస్తున్నారు. సాధ్యం కానీ ప్రతి పనిని నారీ శక్తితో సాధించగలమని చాటి చెబుతున్నారు. సరిగ్గా అలాంటి కోవకు చెందిందే ఈ మహిళ.

చైనాలో 43 ఏళ్ల షాన్డాంగ్  మహిళ ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేకుండా అవలీలగా 100 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరాన్నే అధిరోహించింది. దాదాపు 30 అంతస్తులకు సమానమైన 108 మీటర్ల ఎతైన కొండను అధిరోహించి రికార్డు సృష్టించింది.. 

ఆమె నిలువు రాతి మీదుగా చాలా సునాయాసంగా ఎక్కేయగలదు. అక్కడ ఆమె మగ స్పైడర్‌ పీపుల్‌లోని ఏకైక మహిళ. జస్ట్‌ ఒట్టి చేతులతో శిఖరాలను ఎక్కేస్తుంది . ఆమె తన తండ్రి మార్గదర్శకత్వంలో సుమారు 15 ఏళ్ల వయసులో ఈ ఎతైన కొండను అధిరోహించడం ప్రారంభించింది. అంతేగాదు చిన్నతనంలో తాను అబ్బాయిలతో పోటీ పడి మరీ ఔషధ మూలికలు తెచ్చేందుకు కొండలపైకి ఎక్కడం నేర్చుకున్నట్లు తెలిపింది. 

ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందక మునుపే తాను పక్షుల వ్యర్థాలు వంటివి సేకరించడం కోసం ప్రతి రోజు పర్వతాలను ఎక్కేదాన్ని అని  చెప్పింది షాన్డాంగ్. నిజానికి మియావో ప్రజలు సాంప్రదాయకంగా మారుమూల పర్వత ప్రాంతాలలో నివసిస్తారు. అందువల్లే వారు ఒట్టి చేతులతో ఈజీగా ఎక్కేయగలరు. 

ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఒకరకంగా ఒట్టి చేతులతో పర్వతాన్ని అధిరోహించడంలో వారికి సాటి లేరు. అక్కడ ప్రజలకు ఇది తరతరాలుగా వచ్చిన సంప్రదాయం. అయితే తనను అందరూ  స్పైడర్‌ మహిళగా పిలుస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని చెబుతోంది. ఈ విషయం నెట్టింట తెగ వైరల్‌ కావడంతో ..నెటిజన్ల సదరు మహిళని హ్యాట్సాప్‌ అంటూ ప్రశంసిస్తూ.. పోస్టులుపెట్టారు. 

(చదవండి: కొరియన్‌ నోట భారతీయ సంగీతం.. 'ఔరా' అంటున్న నెటిజన్లు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement