అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) నవలలు రాస్తోంది. పెయింటింగ్స్ వేస్తోంది... ఇంకా ఎన్నో చేస్తుంది. ఇప్పుడు మరో అడుగు పడింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ మేనిక్యూర్ మెషిన్ ‘ఉమియా’ను లండన్‌లోని ఒక బ్యూటీ కంపెనీ లాంచ్ చేసింది.
‘ఇది జెల్ మేనిక్యూర్. మీరు మీ వేలిని మెషిన్ లోపల ఉంచినప్పుడు, అందులోని కెమెరా మీ గోరును స్కాన్ చేసి దాని పరిమాణం, లొకేషన్ అర్థం చేసుకుంటుంది. మేము దీనిని నెయిల్ డీఎన్‌ఏ అని పిలుస్తాం. బ్యూటీ స్పేస్‌లో కొత్తసాంకేతికతకు అద్దం పట్టే ఆవిష్కరణ ఇది.
ఈ జెల్ నెయిల్ ప్రింటర్ ప్రతి నెయిల్‌ను స్కాన్ చేసి, డిజైన్‌ను మీ వేలికి సరిగ్గా సర్దుబాటు చేస్తుంది. సంక్లిష్టమైన నెయిల్ ఆర్ట్‌ను ప్రతి నెయిల్‌కు రెండు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ప్రింట్ చేస్తుంది’ అంటున్నారు ‘ఉమియా’ బ్యూటీ కంపెనీ ప్రతినిధి డోంగ్.
(చదవండి: భూతాపం నుంచి పుట్టిన వినోదం..!)


