Black Heads: మొహంపై బ్లాక్‌హెడ్స్‌ ఉన్నాయా? గోళ్లతో గిల్లుతూ.. నొక్కుతున్నారా? అలా చేయడం వల్ల

Beauty Tips In Telugu: Black Heads On Face Causes And Treatment - Sakshi

ముఖంపై బ్లాక్‌హెడ్స్‌, వైట్‌హెడ్స్‌ వల్ల ఇబ్బంది పడుతుంటారు చాలా మంది! ఈ సులువైన చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను అధిగమించేయొచ్చు!
కనీసం వారానికొకసారయినా ఏదో ఒకరకం ఫేస్‌ప్యాక్‌ వేస్తుంటే చర్మం మీద బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌ వంటివి రావు.
ముఖానికి నాణ్యమైన ఆస్ట్రింజెంట్‌ అప్లయ్‌ చేసి తర్వాత పన్నీటిని అద్దాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు వదిలి శుభ్రపడుతుంది. పన్నీటితో చర్మం సాంత్వన పొందుతుంది. దీంతో బ్లాక్‌హెడ్స్‌ రావడానికి అవకాశం ఉండదు.

ఫేషియల్‌ క్రీమ్‌ల వాడకం కూడా బ్లాక్‌హెడ్స్‌ రావడానికి కారణమవుతుంటుంది.  అందుకని, వీటి వాడకాన్ని తగ్గించాలి.
ప్రతిరోజూ మైల్డ్‌ స్క్రబ్‌ వాడుతుంటే మృతకణాలు తొలగడంతోపాటు బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌ ఏర్పడవు.

గోళ్లతో గిల్లవద్దు
బ్లాక్‌హెడ్స్‌ను గోళ్లతో గిల్లడం కాని, నొక్కడంకాని చేయకూడదు. అలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో చర్మకణాలు సున్నితత్త్వాన్ని కోల్పోతాయి. దీంతో నునుపుదనం పోయి చర్మం గరుకుగా మారుతుంది. మచ్చలు, గీతలు పడడానికి అవకాశం ఎక్కువ.
ముఖానికి ఆవిరి పట్టిన తర్వాత ముఖమంతటినీ లేదా బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌ ఉన్న ప్రదేశాన్ని మునివేళ్లతో మెల్లగా నొక్కడం ద్వారా సులువుగా తొలగించవచ్చు.
 మార్కెట్‌లో దొరికే బ్లాక్‌హెడ్స్‌ రిమూవర్‌ వాడడం కూడా సులువైన మార్గమే. కాని వాటిని వాడినప్పుడు చర్మం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిపుణుల సలహా తప్పనిసరి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top