
గ్రామీణ మహిళకు పాదాభివందనం చేసిన కృష్ణ ష్రాఫ్
జిమ్‌కు వెళ్లడం .. పెద్ద పెద్ద బరువులు ఎత్తడం.. పుషప్స్ తీయడం.. డంబుల్స్ లేపడం.. ఇవన్నీ కష్టమే కావచ్చు.. కానీ పల్లె జీవనం ఇంకా కష్టం.. రోజూ నీళ్ళబిందెలు మోయాలి. పాడి పశువులకు గడ్డి కోసి తీసుకురావాలి.. ధాన్యం బస్తాలు.. నెత్తిన పెట్టుకుని మోయాలి.. ఇంటి పని .. వ్యవసాయపనులు చేయాలి.. ఇదంతా అంత వీజీ కాదు.. జిమ్ములో కోచ్ సారధ్యంలో ఆయన సలహాల మేరకు బరువులు ఎత్తాలి .. కానీ గ్రామీణులు ఎలాంటి శిక్షణ.. నిపుణుల పర్యవేక్షణ లేకుండానే పెద్దపెద్ద బరువులు ఎత్తుతూ జీవనాన్ని భారంగా సాగిస్తుంటారు. వారి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ కుమార్తె కృష్ణ ష్రాఫ్ ఒక మహిళకు పాదాభివందనం చేసారు.. పల్లె ప్రజల జీవన విధానం ఎంత కష్టమో తెలుసుకుని ఓ మహిళను అభినందించారు.
వాస్తవానికి "పల్లెకు పోదాం" అనే ఒక రియాలిటీ షోలో భాగంగా 11 మంది బాలీవుడ్ మహిళా సెలబ్రిటీలు ఒక కుగ్రామంలో రెండు నెలలు ఉండాలి.. ఎలాంటి ఆధునిక సౌకర్యాలు లేకుండా కేవలం కనీస ప్రాథమిక సౌకర్యాల నడుమ రెండు నెలలు ఉండాలి. అందులో భాగంగా వారు గ్రామీణులతో మమేకమై వారు ఎలా జీవిస్తున్నారు.. వారి కష్ట నష్టాలూ ఏమిటి.. వారు జీవనం కోసం ఎలాంటి అవస్థలు.. ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవడమే కాకుండా ఈ సెలబ్రిటీలు కూడా వాటిలో పూర్తిగా పాలుపంచుకోవాలి. ఈ కార్యక్రమానికి రణ్ విజయ్ సింఘా హోస్ట్ గా వ్యవహరిస్తుండగా ఈ కార్యక్రమం జీ టీవీలో ప్రసారం అవుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా జాకీష్రాఫ్ కుమార్తె కృష్ణ ష్రాఫ్ కూడా మధ్యప్రదేశ్ లోని భములీయ గ్రామానికి వెళ్లారు. పల్లెవాసులతో కలగలిసి వ్యవసాయం.. పశుపోషణ ఇంకా పలురకాల పనుల్లో ఈ సెలబ్రిటీలు పాలుపంచుకోవడమే కాకుండా అక్కడ ఏదో ఒక పని చేయడం ద్వారా జీవన భృతిని సంపాదించుకోవాల్సి ఉంటుంది. అయితే కృష్ణ ష్రాఫ్ మాత్రం తనకోసం సెలూన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె పల్లెలో నడుస్తూ ఒక గ్రామీణ మహిళా నెత్తిన గడ్డిమోపు తీసుకువెళ్లడాన్ని చూసారు..
Jackie Shroff’s daughter
Funny as hell
😂
pic.twitter.com/YkwTCbcfe9— Kreately.in (@KreatelyMedia) August 24, 2025
తాను కూడా గడ్డిమోపును మోస్తానని చెబుతూ దాన్ని తన నెత్తిన పెట్టాలని కోరారు.. ఆ మహిళ ఆ మోపును కృష్ణ ష్రాఫ్ నెత్తిన పెడుతుంది. అయినా ఆ గడ్డిమోపు కృష్ణ ష్రాఫ్ నెత్తిన నిలవడం లేదు.. జారిపోతుంది.. రెండుసార్లు మళ్ళీ పెట్టినా అది జారిపోతూనే ఉంటుంది.. వెంటనే ఆ గడ్డిమోపును ఆ మహిళా అందుకుని తలపై పెట్టుకుని వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది.. ఆ క్షణంలో కృష్ణ ష్రాఫ్ ఆ మహిళకు ఎదురెళ్లి.. ఆమె కష్టానికి, గడ్డి మోపు జారిపోకుండా ఉండేలా మోసుకెళ్తున్న తీరుకు అబ్బురపడుతూ ఆమెకు అభివందనం చేస్తుంది.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ ఐంది... నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతూ కృష్ణ ను, ఆమె సంస్కారాన్ని అభినందిస్తున్నారు.
-సిమ్మాదిరప్పన్న