
వీఆర్ హెడ్‌సెట్ ద్వారా భరతనాట్య ప్రదర్శన చూడడం, స్టాండప్ కామెడీ షోలో పాల్గొనడం... ఇ–ధోరణి పెరుగుతోంది. సంప్రదాయం, ఆధునికతను సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానిస్తోంది. ‘కళ సాంకేతికతను సవాలు చేస్తుంది. సాంకేతికత కళను ప్రేరేపిస్తుంది’ అంటాడు స్కైడాన్స్‌యానిమేషన్స్ చీఫ్ జాన్ లాసెటర్. ముంబైలోని ఎన్పీపీఏ భారతీయ శాస్త్రీయ కళలను రక్షించుకోడానికి యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో భారతీయ సాంస్కృతిక సంస్థలు ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. హైడెఫినిషన్ వీడియో, లైవ్–స్ట్రీమింగ్ టెక్నాలజీ మారుమూల గ్రామాల సాంస్కృతిక ప్రదర్శనలను ప్రపంచ స్థాయి ప్రేక్షకుల వరకు తీసుకువెళుతుంది. ఉదాహరణకు ఒక భరతనాట్య నృత్యకళాకారిణి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన నృత్య ప్రదర్శనను ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చు. ఆగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్), హోలోగ్రామ్. డిజిటల్ ;ట్‌ఫామ్స్‌ను కళాకారులు ఉపయోగించడం పెరిగింది.
ఏఆర్, వీఆర్ మార్కెట్‌లో 2029 నాటికి భారత్‌లో వినియోగదారుల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా. ఆర్మాక్స్ రిపోర్ట్ ప్రకారం మన దేశంలోని పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో ప్రేక్షకులను చేరుకోవడానికి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లకు చేరువ అవుతున్నాయి. 2019–2023 మధ్యకాలంలో యూట్యూబ్‌లో స్టాండప్ కామెడీ వ్యూయర్‌షిప్ 40 శాతం పెరిగింది.