చద్దన్నం ప్రయోజనాలు ఇవే.. రోజూ తిన్నారంటే..

Amazing Health Benefits Of Fermented Rice In Telugu - Sakshi

ఉదయాన్నే తప్పనిసరిగా బ్రేక్‌ ఫాస్ట్‌ తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే బ్రేక్‌ఫాస్ట్‌ లేదా టిఫిన్‌ అనగానే మనకి గుర్తొచ్చేవి ఇడ్లి, దోసె, ఉప్మా, చపాతి. పల్లెటూరి వాతావరణం లో పెరిగిన వాళ్ళు గానీ, పల్లె ప్రజలు కానీ తప్పనిసరిగా ఉదయం చద్ది అన్నం తింటారు.. రాత్రి వండిన అన్నాన్ని తెల్లారి ఆవకాయ..పెరుగు కలుపుకుని లేదా పచ్చిమిరప..ఉల్లిగడ్డ నంజుకుని ఒకప్పుడు తినేవారు. మధ్యాన్నం అన్నం తినేదాకా హుషారుగా పని చేసేవారు. ఎందుకంటే చద్ది అన్నంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా రోజూ చద్దన్నం తింటే రోజంతా ఉత్తేజంగా శక్తివంతంగా ఉంటారని పెద్దవాళ్లు చెబుతారు. 

చద్ది అన్నంలో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్లు దాదాపుగా 15 రెట్లు అధికంగా ఉంటాయి. పెరుగన్నంలో ఉల్లిపాయ, మిరపకాయని నంచుకుని తింటే..శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది. శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అధిక రక్తపోటు తగ్గి,శరీరం ఒత్తిడికి గురికాకుండా కాపాడుతుంది.
చదవండి: కీర దోసకాయలు తినేవారు ఈ విషయాలు తెలుసుకున్నారంటే!

అంతేకాదు.. రాత్రిపూట మిగిలిన అన్నంలో అది మునిగే వరకు పాలు పోసి తోడేసి పొద్దున్నే అందులో పచ్చి ఉల్లిపాయి ముక్కలు, అల్లం, కరివేపాకు, జీలకర్ర కలుపుకుని తింటే కడుపులో ఉండే అనారోగ్య సమస్యలు తగ్గడంతోపాటు ఎముకలకి మంచి బలం కూడా. చద్దన్నం తింటే మంచిదే అని ఎక్కువసేపు ఉంచకూడదు. వీలయినంత తొందరగా తినేయాలి. 
చదవండి: Health Tips: తరుచూ పిల్లల్లో చెవినొప్పి.. ఇచా చేస్తే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top