
లండన్‌కు చెందిన ఆర్టిస్ట్ సారా పాతిక సంవత్సరాల క్రితం మోటర్ న్యూరాన్ డిసీజ్ (ఎంఎన్‌డీ) వల్ల మాట్లాడే శక్తిని కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇతరులతో కమ్యూనికేషన్ కోసం వాయిస్ జనరేటింగ్ టెక్నాలీజిని ఉపయోగిస్తూ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ను పునః్రపారంభించింది. ఈ టెక్నాలజీ ద్వారా వినిపించే గొంతు ఆమెది కాదు. దీనికి సంబంధించి ఆమె పిల్లల్లో చిన్న అసంతృప్తి ఉండేది. అమ్మ ఒరిజినల్ వాయిస్ వినాలనుకునేవారు. ఎందుకంటే వారు చిన్న వయసులో ఉన్నప్పుడే సారా మాట కోల్పోయింది.
అమ్మ ఒరిజినల్ వాయిస్ వినడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక వ్యక్తి ఒరిజినల్ వాయిస్‌కు కంప్యూటరైజ్‌డ్ వెర్షన్‌ను క్రియేట్ చేయవచ్చు అని తెలుసుకున్నారు. దీనికి ఎక్కువ నిడివి, క్వాలిటీ రికార్డింగ్ ఉన్న వీడియో కావాలి.అయితే వారికి అమ్మ ఒరిజినల్ వాయిస్‌కు సంబం«ధించి ఒకే ఒక వీడియో క్లిప్ దొరికింది. అది కూడా తక్కువ నిడివి, శబ్ద నాణ్యత లేని వీడియో క్లిప్. ఈ నేపథ్యంలో సారా పిల్లలు న్యూయార్క్‌లోని ఏఐ వాయిస్‌కు ప్రసిద్ధి చెందిన ‘ఎలెవెన్ ల్యాబ్స్’ను సంప్రదించారు.
సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఏఐ ల్యాబ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. సారా ఒరిజినల్ వాయిస్‌ను సృష్టించింది. ఆ వాయిస్‌ను పిల్లలు సారాకు వినిపించినప్పుడు ఆమె ఆనందం తట్టుకోలేక ఏడ్చింది. ‘నా గొంతు నాకు తిరిగి వచ్చింది’ అని ఆ వాయిస్ క్లిప్‌ను తన స్నేహితులకు పంపింది. ఇప్పుడు సారా తన లండన్ యాక్సెంట్‌తో, ఒరిజినల్ వాయిస్‌తోనే కమ్యూనికేట్ చేస్తోంది.