లియాండర్‌ పేస్‌... ప్రముఖ డ్యాన్సర్‌! | 6-year-old Mistakes Leander Paes For Dancer, Tennis Star Reaction Goes Viral On Social Media- Sakshi
Sakshi News home page

లియాండర్‌ పేస్‌... ప్రముఖ డ్యాన్సర్‌!

Published Sun, Mar 24 2024 6:30 AM

6-year-old mistakes Leander Paes for dancer - Sakshi

వైరల్‌

‘ఎక్స్‌’యూజర్‌ పృథ్వీ తన చిన్నారి మేనకోడలు వర్క్‌బుక్‌ నుంచి పోస్ట్‌ చేసిన స్నాప్‌చాట్‌ నెట్‌లోకంలో నవ్వులు పూయిస్తోంది. ఈ వర్క్‌బుక్‌లో‘మ్యాచ్‌ ది ఫాలోయింగ్‌’ శీర్షిక కింద ఎడమవైపు ప్రముఖుల పేరు, కుడివైపు ఆయా రంగాలకు సంబంధించిన బొమ్మలు ఇచ్చారు. ఏ వ్యక్తి ఏ రంగానికి చెందిన వారో జత చేయాలి.

విరాట్‌ కోహ్లీ–క్రికెటర్, లతా మంగేష్కర్‌–సింగర్‌... ఇలా అన్నిటికీ కరెక్ట్‌గానే జత చేసింది ఆరు సంవత్సరాల చిన్నారి. అయితే లియాండర్‌ పేస్‌ దగ్గరే వచ్చింది పేచీ. ప్రభుదేవాతో పాటు లియాండర్‌ పేస్‌ను కూడా డ్యాన్సర్‌ని చేసింది. ఇది చూసి సరదాకారులు ఊరుకుంటారా ఏమిటి? మీమ్సే మీమ్స్‌!

Advertisement
 
Advertisement
 
Advertisement