అచ్చం సంతూర్‌ యాడ్‌ మాదిరిగా 47 ఏళ్ల మామ్‌..! | 47 year old single mom reveals 10 boring diet workout beauty secrets | Sakshi
Sakshi News home page

అచ్చం సంతూర్‌ యాడ్‌ మాదిరిగా 47 ఏళ్ల మామ్‌..! నో ఐస్‌ బాత్‌, నో క్రేజీ డిటాక్స్‌..

May 26 2026 1:04 PM | Updated on May 26 2026 1:07 PM

47 year old single mom reveals 10 boring diet workout beauty secrets

40 ప్లస్‌ అనగానే వృద్ధాప్య ఛాయలు ప్రారంభమవుతుంటాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు అటాక్‌ అయ్యే సమయం కూడా. ఈ వయసులోనే అత్యంత కేర్‌ఫుల్‌గా ఉండాలి. కానీ ఇక్కడొ తల్లి 47 ఏళ్ల వయసులో కూడా పదహారణాల అమ్మాయిలా అందర్నీ ఆకర్షిస్తుంది. అచ్చం సంతూర్‌ యాడ్‌ మాదిరిగా ఆ పిల్లల తల్లి యంగ్‌లుక్‌లో కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ఈ వయసులో అంతలా యవ్వనంగా కాంతింగా కనిపించేందుకు ఆమె ఏమి ఐస్‌బాత్‌లు, విపరీతమైన డిటాక్స్‌లు ఫాలో అవ్వనని చెబుతోందామె. కేవలం సాధారణ దినచర్యతోనే ఇలాంటి యవ్వనపు లుక్‌ని సొంతం చేసుకోవచ్చని అంటోంది. అవేంటంటే..

చెఫ్‌ కమ్‌ డైటీషియన్‌ రాఖీ గనేరివాల్‌ ఇద్దరు పిల్లల తల్లి 47 ఏళ్ల వయసులోనే ఎంతో అందంగా ఆకర్షణీయమైన లుక్‌లో ఉంటారామె. అందుకోసం కేవలం పది సాధారణ పనులనే చేస్తానని అంటోంది. తీవ్రమైన వెల్నెస్‌ ట్రెండ్‌ల కంటే..నిలకడకే ప్రాధాన్యత ఇస్తానంటోంది.

చురుగ్గా ఉండటం..
ప్రతిరోజూ పదివేలకు పైగా అడుగులు వేస్తానని చెబుతుంది. ఇంటి పనులు దగ్గర నుంచి ఉద్యోగ విధుల వరకు అన్నీ చురుగ్గా చేస్తానని చెబుతుంది. అయితే ఒక వ్యూహంలా చేసుకుంటూ పోతానంటోంది. అయితే ఎంత తీరిక లేకపోయినా..ఒక గంట పాటు వర్కౌట్లు చేసేందుకు కట్టుబడి ఉంటానంటోంది. రోజంతా బాడీ వెయిట్‌, స్క్వాట్స్‌, క్యాల్ఫ్‌ రైజర్‌ వంటి వ్యాయామాలు చేస్తానని చెబుతోంది. అయితే సాధారణ చిన్న చిన్న వ్యాయామాలే చాలా ప్రభావవంతంగా ఉంటాయని అంటోంది.

డిజిటల్‌ డిటాక్స్‌..
అలాగే రాత్రినిద్రపోయే ముందు, రోజులో మొదటి మూడు గంటలు ఫోన్‌కి దూరంగా ఉంటానని అంటున్నారు. దీనివల్ల నాడివ్యవస్థ మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. పైగా ఒత్తిడిని నియంత్రించి మంచిగా నిద్రపోగలుగుతామని అంటున్నారామె.

మంచి ఆహారం..
ప్రతి ఉదయం నిమ్మరసం,కొబ్బరి నూనె డ్రింక్‌తో రోజుని ప్రారంభిస్తుందట. ఇది రోజంత శక్తిమంతంగా ఉండేలా చేసి ఆకలి కోరికలను నియంత్రిస్తుందట. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయట. కడుపు నిండిన భావన కోసం రోజూ 110–120 గ్రాముల ప్రోటీన్‌ని తీసుకునేలా కేర్‌ తీసుకుంటారట. సాధారణంగా నిద్రలేచిన గంటలోపు ప్రోటీన్ పౌడర్‌ను తీసుకుని, ఆ తర్వాత గుడ్లు, పనీర్, టోఫు, గ్రీకు యోగర్ట్‌, వంటి ఇతర ఆహారాలను తీసుకుంటుందట. 

అయితే అన్నింట్లకంటే ముఖ్యం మూడు లీటర్ల నీళ్లు తాగడం అనేది కీలకం అంటోంది. రోజూ రెండు పండ్లు తప్పనిసరి అని చెబుతోంది. అలాగే ఆయురారోగ్యాలతో ఉండాలనే సాధారణ చిన్న చిన్న పనులతోనే ఇదంతా సాధ్యమని అంటోందామె. పరిపూర్ణత కంటే నిలకడక పాటించేందుకు ప్రాధాన్యత ఇవ్వమని కోరుతోంది.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: విజయవంతమైన వివాహబంధం అంటే అదేనా..!: డేటింగ్ యాప్ సీఈఓ)


 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement