న్యూస్‌రీల్
ఏలూరు నిమ్మకాయల మార్కెట్‌లో ధరలు (కిలో రూ.లలో)
ఏలూరు
ఎండల తీవ్రత, వాతావరణ మార్పులతో నిమ్మకాయలకు డిమాండ్ పెరిగింది. మరోవైపు సకాలంలో వర్షాలు లేకపోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో నిమ్మ ధరలు మండిపోతున్నాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఒక్క నిమ్మకాయ రూ.10 వరకు పలుకుతుండగా.. చిన్న కాయలు రూ.20కి మూడు చొప్పున విక్రయిస్తున్నారు. ఎండల తాపానికి నిమ్మ వినియోగం పెరగడం, అందుకు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలు ౖపైపెకి వెళ్తున్నాయి.
7
గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
నిమ్మకాయల ధర బాగా పెరిగిపోయింది. గతంలో మాదిరిగా ఎక్కువగా కొనలేకపోతున్నాం. అవసరమైనన్ని మాత్రమే కొనుగోలు చేసి, చాలా జాగ్రత్తగా వాడుతున్నాం. ఒక నిమ్మకాయ కూడా వృథా కాకుండా చూసుకుంటున్నాం. ధరలు ఇలా పెరగడం మాలాంటి సామాన్య కుటుంబాలకు ఇబ్బంది.
– ఎస్.మీరాబాయ్, గృహిణి, నరసాపురం
నిమ్మకాయల ధర బాగా పెరిగిపోయింది. షాపులో నిమ్మ సోడాలు, ఇతర వాటికి నిమ్మకాయలు తప్పనిసరిగా కావాలి. గతంలో ద్వారకాతిరుమలలో వ్యాపారులు 12 కాయలున్న కవర్‌ను రూ.10 లకు అమ్మేవారు. ఇప్పుడు రూ.50 అయ్యింది. ఇలా పెరుగుతున్న ధ రలతో వ్యాపారం కష్టతరంగా మారింది.
– దేశెట్టి రాంబాబు, కూల్‌డ్రింక్ షాపు
యజమాని, ద్వారకాతిరుమల
ద్వారకాతిరుమల: మార్కెట్‌లో నిమ్మకాయ ధరలు కిలో గరిష్టంగా రూ.150, కనిష్టంగా రూ.100 వరకు పలుకుతున్నాయి. ధరలు ఎప్పుడు తగ్గుతాయోనన్న ఆందోళనతో కొందరు రైతులు పూర్తిగా ఎద గని చిన్న కాయలను సైతం కోసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. అయితే చిన్న, పచ్చి కాయలు అధికంగా మార్కెట్‌కు వస్తే ధరలు తగ్గే అవకాశం ఉంటుందని వ్యాపారులు రైతులను హెచ్చరిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 15 వేల హెక్టార్లలో..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 15 వేల హెక్టార్లలో నిమ్మ సాగవుతోంది. ఎకరాకు సగటున 8 టన్నులు, హెక్టారుకు సుమారు 15–20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. సాధారణంగా జిల్లాలో ఏడాదికి సుమారు 2.25 లక్షల నుంచి 3 లక్షల టన్నుల వరకు నిమ్మ ఉత్పత్తి అవుతుంది.
కుదేలైన ఎగుమతులు
ఏలూరు, ద్వారకాతిరుమల, గొపన్నపాలెం, జంగారెడ్డిగూడెం, యాదవోలు మార్కెట్ యార్డుల నుంచి నిమ్మకాయలు పశ్చిమబెంగాల్, కర్ణాటక, బిహార్, ఒడిసా తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. వేసవి సీజన్‌లో సాధారణంగా ఈ మార్కెట్ల నుంచి రోజుకు సుమారు 330 టన్నుల వరకు ఎగుమతి జరిగేది. ఈ ఏడాది రోజుకు కేవలం 90 టన్నుల వరకు మాత్రమే ఎగుమతి అయ్యిందంటే దిగుబడి తగ్గుదల ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అదే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుండటమే ధరల పెరుగుదలకు కారణం.
పండు కాయలు కిలో రూ.50 : పండిన నిమ్మకాయలు ఎగుమతికి పనికిరావు. దీంతో వాటిని స్థానికంగా కూల్‌డ్రింక్ షాపులు, నిమ్మకాయల విక్రయదారులకు కిలో రూ.50లకు అమ్ముతున్నారు. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కాబట్టి కుళ్లిపోయినవి, ఎండిపోయినవి మినహా.. మిగిలిన కాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొందరు వినియోగదారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఎండిపోతున్న కాయలను సైతం కొంటున్నారు.
ద్వారకాతిరుమల క్షేత్రంలో.. ద్వారకాతిరుమల చుట్టుపక్కల గ్రామాల్లో నిమ్మ సాగు అధికంగా ఉండటంతో స్థానిక చిల్లర వ్యాపారులు రైతుల నుంచి నిమ్మకాయలను బస్తాలుగా కొనుగోలు చేసి క్షే త్రానికి వచ్చే భక్తులకు విక్రయిస్తుంటారు. గతంలో 12 నిమ్మకాయలున్న కవర్‌ను రూ.10కి విక్రయించేవారు. ప్రస్తుతం అదే కవర్ రూ.50కి చేరింది. పట్టణాల నుంచి వచ్చే భక్తులు వాటిని ఆసక్తిగా కొనుగోలు చేస్తుండటం గమనార్హం.
తేదీ కొత్త కాయలు పాత కాయలు
ఈనెల 12న 70–90 100–110
ఈనెల 14న 95 120
ఈనెల 15న 90 115
ఈనెల 16న 95–105 105–120
ధరలు ౖపైపెకి..
ఎండల వేడితో తగ్గిన దిగుబడి
పెరుగుతున్న ధరలు
కిలో రూ.100–రూ.150
పట్టణాల్లో ఒక్క కాయ రూ.10
ఉమ్మడి జిల్లా నుంచి తగ్గిన ఎగుమతులు


