శోకసంద్రంలో ఏలూరు | - | Sakshi
Sakshi News home page

శోకసంద్రంలో ఏలూరు

Sep 17 2026 1:02 AM | Updated on Sep 17 2026 1:02 AM

మాజీ మంత్రి ఆళ్ల నానికి ఘన నివాళి

రాజకీయాలకు అతీతంగా నేతలు, కార్యకర్తలు, అభిమానులు రాక

నేడు ఏలూరులో అంత్యక్రియలు

ఏలూరు టౌన్‌: మాజీ మంత్రి ఆళ్ల నాని అకాల మరణంతో ఏలూరు నగరం శోకసంద్రంలో మునిగిపోయింది. నగరంపై మూడు దశాబ్దాల పాటు రాజకీయ రంగంలో ఆయన తనదైన ముద్ర వేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయభేరి మోగించి చరిత్ర సృష్టించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేస్తూ ఏలూరుకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. ఆయన ఆకస్మిక మరణంతో నగరవాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నాని పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆయన స్వగృహంలో ఉంచారు. గురువారం ఉదయం 9 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో నాని అంత్యక్రియలు చేపట్టనున్నారు. రాజకీయాలకు అతీతంగా నాని పార్థీవదేహాన్ని పలువురు సందర్శించి ఘన నివాళి అర్పించారు. వైఎస్సార్‌సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌ దగ్గరుండి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

వైఎస్సార్‌సీపీ నేతల ఘన నివాళులు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు (ఏలూరు), ముదునూరి ప్రసాదరాజు (పశ్చిమగోదావరి) తమతో ఆళ్ల నాని సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హుందాతనం, రాజకీయ చతురత, ప్రజలకు సేవ చేయాలనే తపనతో నాని పనిచేశారని గుర్తు చేసుకున్నా రు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రా ష్ట్రమంతా పర్యటించి ప్రజలకు సేవ చేశారన్నారు. ఆళ్ల నాని మరణం తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. వైఎస్సార్‌సీపీ ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, తాడేపల్లిగూడెం ఇన్‌చార్జి వడ్డి రఘురాం, చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, నూజివీడు మాజీ ఎమ్మెల్యే, ఇన్‌చార్జి మేకా వెంకట ప్ర తాప్‌ అప్పారావు, మాజీ ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కొ ఠారు రామచంద్రరావు నాని పార్థీవదేహం వద్ద నివాళులర్పించారు. ఏలూరు పార్లమెంట్‌ పరిశీలకులు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్‌, వైఎస్సార్‌సీపీ బీసీసెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నౌడు వెంకటరమణ, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు చెల్లెం ఆనంద్‌ప్రకాష్‌ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

రాజకీయాలకు అతీతంగా..

ఎమ్మెల్యే బడేటి చంటి, ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివా ళి అర్పించారు. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ మంచి నాయకుడ్ని కోల్పోయామంటూ సంతాపం వ్యక్తం చేశారు. మాజీ కో–ఆప్షన్‌ సభ్యు డు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు నివాళి అర్పించారు. డాక్టర్‌ ప్రసాద్‌ అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

నా ప్రాణ స్నేహితుడు: పేర్ని నాని

‘నా ప్రాణ స్నేహితుడ్ని కోల్పోయాను. మూడు దశాబ్దాలుగా యువజన కాంగ్రెస్‌ నేతగా ఆళ్ల నాని ప నిచేస్తున్న కాలం నుంచి మంచి మిత్రుడిగా స్నేహం ఏర్పడింది. మేమిద్దరం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవటం, మంత్రులుగా పనిచేశాం. రెండేళ్లుగా ఏలూరు ప్రజలు ఆయన లేనిలోటును గుర్తిస్తూ ఆళ్ల నానిని తలచుకోని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. రాజకీయ నేతగా మచ్చలేకుండా ప్రజలకు సేవ చేసిన గొప్ప నాయకుడు నాని. దేవుడు ఆయన కుటుంబానికి అండగా ఉండాలనీ, కోరుకుంటున్నా’ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.

కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి

శాసనమండలి విపక్ష నేత, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కన్నబాబు, గుడివాడ అమర్నాథ్‌, మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, నేత కరణం ధర్మశ్రీ నాని పార్థీవదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అలాగే మాజీ హోమంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌, వైఎస్సార్‌సీపీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కొవ్వూరు సమన్వయకర్త తలారి వెంకట్రావు నాని పార్థీవదేహం వద్ద నివాళులర్పించారు. ఆయన సతీమణి, కుమారులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

నాని పార్థ్ధీవదేహం వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, సమన్వయకర్తలు కంభం విజయరాజు, మామిళ్లపల్లి జయప్రకాష్‌, వడ్డి రఘురాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement