జీడీపీ వృద్ధిపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

జీడీపీ వృద్ధిపై సమీక్ష

Sep 17 2026 1:02 AM | Updated on Sep 17 2026 1:02 AM

జీడీపీ వృద్ధిపై సమీక్ష విజిలెన్స్‌ కమిటీ సమావేశం వాయిదా 19న న్యాయ అవగాహన సదస్సు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి ద్వారా జిల్లా జీడీపీ వృద్ధికి అవకాశాలను పరిశీలించి ప్రణాళికలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం అమరావతి ఎకనామిక్‌ రీజియన్‌ కన్సల్టెంట్స్‌ బృంద సభ్యులు, జిల్లా అధికారులతో జిల్లాలో అమరావతి ఎకనామిక్‌ రీజియన్‌ ప్రణాళికపై ఆయన సమీక్షించారు. జిల్లా ప్రణాళికాధికారి శ్రీనివాస్‌, జిల్లా పరిశ్రమల జనరల్‌ మేనేజర్‌ వెంకటరావు, మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అధికారి రామ్మోహన్‌, అమరావతి ఎకనామిక్‌ రీజియన్‌ కన్సల్టెంట్స్‌ బృందం సభ్యులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించాల్సిన జిల్లాస్థాయి విజిలెన్స్‌ కమిటీ సమావేశం వాయిదా పడిందని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి బాబు విలియమ్స్‌ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాన్ని ఈనెల 22న మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహిస్తామన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కలెక్టరేట్‌లో ఈనెల 19న ఉదయం 10 గంటలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు జిల్లా సెషన్స్‌ జడ్జి ఎస్‌.శ్రీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేసున్న సంక్షేమ పథకాల సమర్థవంతంగా అమలు, మాదకద్ర వ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, ని యంత్రణ, ఆరోగ్య సంరక్షణ మార్గదర్శకత్వం, తదితర కార్యక్రమాలపై న్యాయ పరమైన అంశాలపై అవగాహన కలిగిస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement