మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

Aug 5 2026 1:23 AM | Updated on Aug 5 2026 1:23 AM

మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు ‘మిస్టర్‌ ఆంధ్ర’గా చింతలపూడి యువకుడు కొల్లేరులో చేపల సాగు భేష్‌ తగ్గుతున్న గోదావరి వరద టెట్‌ పరీక్షల ఫిర్యాదులకు కంట్రోల్‌ రూమ్‌

చింతలపూడి (జంగారెడ్డిగూడెం): గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి, తమలపాకుల అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ. 2,25,025 ఆదాయం సమకూరిందని, నిత్యాన్నదాన సత్రంలో 2,556 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, కార్యనిర్వహణాధికారి (ఈవో) ఆర్‌వీ చందన తెలిపారు. మరోవైపు ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను విజయవాడ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎ.శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ వై.భానుచంద్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

చింతలపూడి: ఆంధ్రప్రదేశ్‌ బాడీ బిల్డింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో చింతలపూడికి చెందిన చిన్ని గోల్డ్‌ జిమ్‌ సభ్యుడు కె.ధనుష్‌ యాదవ్‌ ప్రతిభ చాటాడు. భీమవరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్‌ చాంపియన్‌షిప్‌లో 75 కేజీల విభాగంలో అత్యుత్తమ ప్రతిభతో ప్రతిష్టాత్మక ‘మిస్టర్‌ ఆంధ్ర’ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఫిట్‌నెస్‌ కోచ్‌ కె. సాయికుమార్‌ మాట్లాడుతూ సరైన శిక్షణ, క్రమ శిక్షణ, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయాలు సాధించవచ్చనడానికి ధనుష్‌ యాదవ్‌ ఒక నిదర్శనం అన్నారు. మిస్టర్‌ ఆంధ్ర టైటిల్‌ సాధించిన ధనుష్‌ యాదవ్‌ను పట్టణ ప్రము ఖులు, క్రీడాభిమానులు, యువత అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

కై కలూరు: కొల్లేరు చేపల సాగు ఎంతో ఆచరణాత్మకంగా ఉందని, రైతులే శాస్త్రవేత్తల మాదిరిగా ఆలోచించి సాగులో విజయాలు సాధిస్తున్నా రని ఒడిశా రాష్ట్ర ఉత్సాహిక చేపల రైతులు కితాబిచ్చారు. ఒడిశా మత్స్యశాఖ అధికారి పార్థో ఆధ్వర్యంలో 22 మంది ఔత్సాహిక రైతులు మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ముందుగా దానగూడెంలో చేపల పట్టుబడిని పరిశీలించి, అక్కడ రైతులు చెప్పిన సాగు పద్ధతులను పుస్తకంలో నోట్‌ చేసుకున్నారు. ఆ తర్వాత కై కలూరులో ఆక్వా షాప్‌ను సందర్శించి, యజమాని మోహన్‌ను అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీపంలోని కొల్లేరు ప్రాంత చెరువులను సందర్శించారు. కొర్రమీను, ఫంగస్‌, కట్టా, రూహు, మృగల చేపల రకాలను స్థాని కులు సందర్శకులకు వివరించారు. అక్కడి నుంచి చేపల ప్యాకింగ్‌ సెంటర్‌ను పరిశీలించి, కై కలూరు మత్స్యశాఖ కార్యాలయంలో మత్స్యశాఖ అధికారి సీహెచ్‌. గణపతిని కలిసి ల్యాబ్‌లో లభించే సేవలను అడిగి తెలుసుకున్నారు.

పోలవరం రూరల్‌: గోదావరి వరద రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో క్రమేపీ వరద నీరు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 31 మీటర్లకు చేరుకోగా, స్పిల్‌వే నుంచి 6.50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ, దిగువ ప్రాంతాల్లో కొంతమేర వరద ప్రవాహం కొనసాగుతోంది.

భీమవరం: ఉపాధ్యాయుల టెట్‌ పరీక్షకు సంబంధించిన సూచనలు, సలహాలు, ఫిర్యాదుల కోసం భీమవరం జిల్లా కలెక్టరేట్‌లోని విద్యాశాఖ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇ నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు నిర్వ హించే టెట్‌ పరీక్షకు సంబంధించి ఏవైనా ఫిర్యా దులు ఉంటే 93982 31218, 94919 69299, 83418 79098 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement