ఆగిరిపల్లి: ఏపీ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఏపీఏఐఎంఎస్) 2.0 యాప్‌తో భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీస్ ఎండీ ఎం.సూర్యతేజ ఐఏఎస్ అన్నారు. బుధవారం సాయంత్రం ఆగిరిపల్లిలోని రైతు సేవ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, ఈ యాప్ ద్వారా భవిష్యత్తులో అందించాల్సిన అదనపు సేవలపై రైతులతో చర్చించారు. పొలంలో భూగర్భ జలాల స్థాయిని బట్టి ఏ పంట వేయాలో సూచనలు అందిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు ఈ సందర్భంగా సమాధానమిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, టెక్నికల్ ఏఓ వెంకటేశ్వరరావు, వ్యవసాయ అధికారులు భవాని, చెన్నారావు పాల్గొన్నారు.


