వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు నానికి నోటీసులు
ఏలూరు టౌన్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో డీఎస్సీ–25 అవినీతిపై పార్టీ జిల్లా యువజన అధ్యక్షులు కామిరెడ్డి నాని ఆధ్వర్యంలో ఏలూరులో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఇదే సందర్భంలో ఏలూరు టూటౌన్ పోలీసులు కామిరెడ్డి నానికి పార్టీ కార్యాలయం వద్ద నోటీసులు జారీ చేశారు. ర్యాలీకి అనుమతి లేదనీ, కాదని చేస్తే చట్టం మేరకు చర్యలు తప్పవంటూ నోటీసు అందజేశారు. మంత్రి లోకేష్ రాజీనామా, సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో ఇప్పటికే కూటమి ప్రభుత్వ వైఫల్యంతో ప్రజల్లో విశ్వాసం కోల్పోగా, మరింత సన్నగిల్లుతుందనే భయంతో పోలీసులను ఉసిగొలిపారని ప్రజలు విమర్శిస్తున్నారు. టీడీపీ నేతల బెదిరింపులకు భయపడేది లేదనీ, యువత, నిరుద్యోగులు, విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తున్నామని, ప్రజల కోసం దేనికై నా సిద్దమని యువజన విభాగం జిల్లా అధ్యక్షులు నాని స్పష్టం చేశారు.


