ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థి దశ నుంచే ప్రతీ ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్‌వీ ప్రసాద్ పిలుపునిచ్చారు. సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో తలసేమియా బాధితుల కోసం రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారన్నారు కళాశాల ప్రిన్సిపాల్ వంగ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ విద్యార్థులు స్వచ్ఛందంగా అందించిన రక్తం తలసేమియా రోగులకు ఉపయోగపడటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా నిర్మల, రెడ్‌క్రాస్ పీఆర్‌ఓ కేవీ రమణ, వైస్ ప్రిన్సిపాల్ డీవీవీ ఫణి కుమార్, మెడికల్ ఆఫీసర్ కే. శ్రీమాలక్ష్మి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె.హరిబాబు, కల్చరల్ కో–ఆర్డినేటర్ పి.సౌభాగ్యలక్ష్మి, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.


