ద్వారకాతిరుమల: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశ, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. క్షేత్ర ఉపాలయమైన భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో బుధవారం నుంచి 31 వరకు మూడు రోజుల పాటు వరుణదేవుని అనుగ్రహం కో సం వారుణానువాక జపం, వరుణ సూక్త పా రాయణాలు, రుద్రహోమాలు, సహస్ర ఘటాభిషేకాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు.
కై కలూరు: జిల్లాలో ఆదివారం రాత్రి విస్తార వర్షం కురిసింది. సూపర్ ఎల్‌నినో నేపథ్యంలోలో వర్షాల కోసం వరుణ పూజలు సైతం పలు గ్రామాల్లో జరుగుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా పెదపాడులో 67.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత స్థానాలు కై కలూరులో 51.6, ఆగిరిపల్లిలో 36.4, ముదినేపల్లిలో 28.4, కలిదిండిలో 25.8, మండవల్లి లో 24.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. జిల్లా మొత్తం 331.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.


