స్ఫూర్తిప్రదాత ప్రగడ కోటయ్య | - | Sakshi
Sakshi News home page

స్ఫూర్తిప్రదాత ప్రగడ కోటయ్య

Jul 27 2026 12:54 AM | Updated on Jul 27 2026 12:54 AM

స్ఫూర్తిప్రదాత ప్రగడ కోటయ్య గోదావరిలో పెరుగుతున్న వరద

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో చేనేత రంగ పరిశ్రమ అభివృద్ధికి, చేనేత కార్మికుల సంక్షేమం కోసం విశేషంగా కృషిచేసిన దివంగత ప్రగడ కోటయ్య జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో జిల్లా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో కోటయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. కోటయ్య చిత్రపటానికి కలెక్టర్‌తో పాటు జేసీ అభిషేక్‌ గౌ డ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కోటయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఉత్తర్వు లు జారీ చేయడం శుభపరిణామమన్నారు. చే నేత వర్గాల ప్రయోజనాల కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఇన్‌చార్జి డీఆర్వో ఎల్‌.దేవకీ దేవి, ఉమ్మడి జిల్లా చేనేత జౌళిశాఖ శాఖ అధికారి బి.హనుమంతరావు, కలెక్టరేట్‌ ఏఓ ఎన్‌వీ నాంచారయ్య పాల్గొన్నారు.

పోలవరం రూరల్‌: గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఎగువ ప్రాంతాల నుంచి కొండవాగుల నీరు వచ్చి చేరడంతో నదిలో వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 28 మీటర్లు దాటింది. స్పిల్‌వేకి చెందిన 48 గేట్ల ద్వారా 52 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లో గోదా వరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement