తాడేపల్లిగూడెం (టీఓసీ): మాస్టర్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో వెస్ట్ గోదావరి జిల్లా అండర్–19 ఓపెన్ అండ్ గర్‌ల్స్ చదరంగం పోటీలు పట్టణంలో ఆదివారం వాణి స్కూల్‌లో హోరాహోరీగా జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్ర చెస్ వైస్ చైర్మన్ సీహెచ్‌ఆర్‌కే వర్మ, నిర్వాహకుడు ఎస్‌ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ జమ రాంబాబు హాజరయ్యారు. మొదటి నాలుగు స్థానాలు సాధించిన క్రీడాకారులు జిల్లా తరపున ఆగస్టు 1, 2 తేదీల్లో అనకాపల్లిలో జరిగే రాష్ట్ర అండర్ చదరంగం పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. బాలుర విభాగంలో ఎన్.కుష్వంత్ (భీమవరం), కె.త్రిశాంక్ కోటి (తాడేపల్లిగూడెం), పి.జోగేందర్ (తాడేపల్లిగూడెం) మౌర్య రామసూర్య (పాలకొల్లు), బాలికల విభాగంలో వి.సునీత (గణపవరం), కె.మోక్షిత్ (భీమవరం), కె.సాన్విత (తణుకు), కె.తేజస్విని (తాడేపల్లిగూడెం)లు విజేతలుగా నిలిచారు.


