విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

Jul 26 2026 2:02 AM | Updated on Jul 26 2026 2:02 AM

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

చింతలపూడి: ఆయిల్‌పాం తోటలో గెలలు కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ వైర్లు తగిలి ఓ వ్యక్తి అక్కడికక్కడే మతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ప్రగడవరం గ్రామానికి చెందిన పల్లపు నాగరాజు (40) జీవనోపాధిలో భాగంగా వ్యవసాయ పనులకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో మండలంలోని యర్రగుంటపల్లి గ్రామంలో ఒక రైతుకు చెందిన ఆయిల్‌పాం తోటలో గెలలు కోసేందుకు వెళ్లాడు. తోటలో గెలలు కోస్తున్న సమయంలో, విద్యుత్‌ వైర్లు గెడకు తగలడంతో తీవ్ర విద్యుత్‌ షాక్‌కు గురై అపస్మారక స్ధితికి చేరుకున్నాడు. నాగరాజును ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. నాగరాజు మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, ప్రగడవరం గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉపాధి కోసం వెళ్లిన వ్యక్తి శవమై తిరిగిరావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ యజమాని దూరమవ్వడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఎస్సై కె సతీష్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement