రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు మనోజ్ఞ ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు మనోజ్ఞ ఎంపిక

Jul 24 2026 1:03 AM | Updated on Jul 24 2026 1:03 AM

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు మనోజ్ఞ ఎంపిక 26న ఉమ్మడి జిల్లా దివ్యాంగుల క్రికెట్‌ జట్ల ఎంపిక రేపు ఐటీడీఏలో జాబ్‌మేళా

తణుకు అర్బన్‌ : స్థానిక ఎస్‌కేఎస్‌డీ మహిళా జూనియర్‌ కళాశాల విద్యార్థిని మానె మనోజ్ఞ (ఎంపీసీ) రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ భూపతిరాజు హిమబిందు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల్లో మనోజ్ఞ అండర్‌ 17 బాలికల సింగిల్స్‌ విభాగంలో విన్నర్‌గాను, అండర్‌ 19 బాలికల డబుల్స్‌ విభాగంలో విన్నర్‌గాను, అండర్‌ 19 బాలికల సింగిల్స్‌ విభాగంలో రన్నర్‌గా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. ఈ సంద్భంగా ప్రశంసాపత్రాలు, ట్రోఫీలు అందుకున్నట్లు చెప్పారు. గురువారం కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ చిట్టూరి సత్య ఉషారాణి, జాయింట్‌ సెక్రటరీ చిట్టూరి వెంకట కృష్ణారావు విద్యార్థిని మనోజ్ఞతోపాటు ఫిజికల్‌ డైరెక్టర్‌, అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందించారు.

పాలకొల్లు సెంట్రల్‌: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన జిల్లా స్థాయి శారీరక దివ్యాంగుల క్రికెట్‌ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా దివ్యాంగుల క్రికెట్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌ లేళ్ల సుబ్బారాయుడు తెలిపారు. గురువారం మీడియాకు వివరిస్తూ డిఫరెంట్లీ అబలీడ్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంద్రప్రదేశ్‌ (డీసీసీ, ఏపీ), డిఫరెంట్లీ అబ్లీడ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంద్రప్రదేశ్‌ (డీఏసీఏ) సంయుక్త ఆధ్వర్యంలో అమరావతి ఇన్‌క్లూజివ్‌ క్రికెట్‌ కప్‌ 2026 టోర్నమెంట్‌కు సంబంధించి జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 8 గంటల నుంచి తణుకు సమీపంలోని పైడిపర్రు వై జంక్షన్‌ వద్ద ఉన్న ఏఎస్‌ఆర్‌ బీఈడి క్యాంపస్‌లోని ఏఎస్‌ఆర్‌ క్రికెట్‌ అకాడమీ నెట్స్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎంపికలో పాల్గొనే దివ్యాంగ క్రీడాకారులు తమ వ్యక్తిగత క్రికెట్‌ కిట్‌ తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు. పూర్తి వివరాలకు 95159 21299, 97019 22334 సెల్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు.

బుట్టాయగూడెం: గిరిజన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ నెల 25వ తేదీ కేఆర్‌పురం వైటీసీలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లలిత గిరిజన మహిళా మండలి సంస్థ ద్వారా ఉద్యోగ కల్పన కోసం జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు శనివారం ఉదయం 10 గంటలకు వైటీసీలో జరిగే కార్యక్రమంలో తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్‌లు, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు 94933 59574, 73825 52616 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement