బదిలీల రాజకీయం | - | Sakshi
Sakshi News home page

బదిలీల రాజకీయం

Jul 23 2026 1:12 AM | Updated on Jul 23 2026 1:12 AM

చిక్కిన చైన్‌ స్నాచర్‌

న్యూస్‌రీల్‌

చిక్కిన చైన్‌ స్నాచర్‌
చేపలు అమ్ముకుంటున్న వృద్ధురాలిని బురిడీ కొట్టించి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 8లో u
భూ వివాదం సద్దుమణిగింది.. రాజకీయ వేడి రాజుకుంది. చివరకు బదిలీల కత్తి దేవస్థానం అధికారుల మెడపై వేలాడుతోందన్న చర్చ ద్వారకాతిరుమల క్షేత్రంలో జోరందుకుంది. ఆలయ చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావుకు అనుకూలంగా ఉన్నారనే కారణంతోనే అధికారులను ఒక్కొక్కరిని పచ్చనేతలు టార్గెట్‌ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇద్దరు సూపరింటెండెంట్‌లు డిప్యుటేషన్‌పై బదిలీ కాగా.. మరి కొందరిపై, ముఖ్యంగా ఇద్దరు ఇంజనీరింగ్‌ విభాగ అధికారులపై బదిలీ వేటు తప్పదన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆలయ చైర్మన్‌ వయోభారాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలన సౌలభ్యం కోసం చైర్మన్‌కు ఆయన కుమారుడిని సహాయకుడిగా నియమిస్తూ ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీఓను సైతం రద్దు చేయించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

గురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026

ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్ర దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ భూకబ్జా వివాదం ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. భూవివాదం కూటమి పాలకులకు, నేతలకు తలనొప్పిగా మారిన నేపథ్యంలో.. అందుకు కారణమయ్యారన్న అనుమానంతో కొందరు దేవస్థానం అధికారులపై బదిలీ వేటు మొదలైంది. ఇప్పటికే ఇద్దరు అధికారులు బదిలీ కాగా.. మరికొందరు కీలక అధికారులు టార్గెట్‌ లిస్టులో ఉన్నారన్న చర్చ సాగుతోంది. దీంతో శ్రీవారి దేవస్థానంలో అసలు నడుస్తోంది పరిపాలనా ప్రక్రియా..? రాజకీయ కక్ష సాధింపా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భూవివాదంతో మొదలైన రగడ

దేవుడి భూకబ్జా వ్యవహారం బయటకు రావడంతో వివాదం రాజుకుంది. దేవస్థానం చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు కుమారుడు, అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్‌ఎన్‌ నివృతరావు గత నెల 23న వివాదాస్పద భూమి అంశంపై ఓ టీడీపీ నేతను నిలదీయడం, అదే రోజు తొలి ట్రస్ట్‌ బోర్డు సమావేశంలో ఆ నేతతో వాగ్వాదం జరగడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. అనంతరం దేవుడి భూమి.. దేవుడికే దక్కాలంటూ మాజీ హోం మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ నేతలు చేపట్టిన ఆందోళనలు రాజకీయ దుమారాన్ని రేపాయి. దాంతో అధికారులు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి, జరిగిన తప్పులను సరిచేయడం కూడా పాలకుల కబ్జాకోరుతనాన్ని మరింత బహిర్గతం చేసింది.

ఇప్పటికే ఇద్దరిపై బదిలీ వేటు

గతంలో శ్రీవారి దేవస్థానం నుంచి అన్నవరం దేవస్థానానికి బదిలీ అయిన సూపరింటెండెంట్‌ కోటగిరి కిషోర్‌ ఏడాది క్రితం డిప్యూటేషన్‌పై తిరిగి మళ్లీ ఇక్కడికి వచ్చారు. ఆయన డిప్యుటేషన్‌ కాలం ఇటీవల ముగియడంతో, మరో ఏడాది పాటు దాన్ని పొడిగించుకునేందుకు కిషోర్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా మంగళవారం సూపరింటెండెంట్‌ వాసా నగేష్‌ను పెనుగంచిప్రోలు దేవస్థానానికి ఏడాది పాటు డిప్యూటేషన్‌పై బదిలీ చేయడం క్షేత్రంలో చర్చకు దారితీసింది. ఈ ఇద్దరు బదిలీ పచ్చ పాలకుల కనుసన్నల్లో జరిగిందేనన్న చర్చ జరుగుతోంది. పరిపాలనా అవసరాల దృష్ట్యా అని సాకుచూపి, పాలకుల ఆదేశాలను దేవాదాయశాఖ అధికారులు అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరో ఇద్దరు అధికారులపై గురి

దేవస్థానం ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ డీవీ భాస్కర్‌, ఎలక్ట్రికల్‌ డీఈ టి.సూర్యనారాయణ కూడా టార్గెట్‌ లిస్టులో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. త్వరలో వీరిపైనా బదిలీ చర్యలు ఉంటాయని కొందరు నేతలు బహిరంగంగా చెబుతున్నారు. ఈ ఇద్దరూ చైర్మన్‌కు సన్నిహితులుగా గుర్తింపు పొందిన అధికారులే కావడం గమనార్హం.

ఉద్యోగం చేయలేం బాబోయ్‌

రాజకీయ ఒత్తిళ్లు, బదిలీల బెదిరింపులతో దేవస్థానం అధికారులు, సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలా ఒత్తిళ్లు కొనసాగితే ఉద్యోగాలు చేయడం కష్టమే’ అని పలువురు వాపోతున్నారు. గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు తమకు ఎదురవలేదని అంటున్నారు.

లక్ష్మీపురం భూవివాదం తర్వాత దేవస్థానం అధికారులపై బదిలీ బాణం

ఇప్పటికే ఇద్దరు బదిలీ.. మరో ఇద్దరిపై గురి

చైర్మన్‌ కుమారుడి జీఓను రద్దు చేయించేందుకు ప్రయత్నాలు?

శ్రీవారి క్షేత్రంలో హాట్‌టాపిక్‌గా బదిలీ రాజకీయాలు

(ఏఐ సృష్టించిన చిత్రం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement