రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక

Jul 23 2026 1:12 AM | Updated on Jul 23 2026 1:12 AM

టి.నరసాపురం: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు స్థానిక అప్పలరాజుగూడెం గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సిహెచ్‌. వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను బుధవారం పాఠశాల ఆవరణలో ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ ఈ నెల 21న ఏలూరు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ పోటీల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు పలు విభాగాల్లో ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించారని వెల్లడించారు. అండర్‌–14 విభాగంలో కె.కౌశిక్‌ వర్థన్‌ కిడ్స్‌ జావిలిన్‌ త్రోలో ప్రథమ స్థానం సాధించగా, అండర్‌–18 విభాగంలో బి.రాజేష్‌ షాట్‌పుట్‌లో, జి.భరత్‌ కుమార్‌ 100 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానాల్లో నిలిచారు. అలాగే అండర్‌–16 విభాగంలో పి.మోషే 60 మీటర్ల పరుగు పందెంలో, జి.మనోజ్‌ షాట్‌పుట్‌లో ద్వితీయ స్థానాలు దక్కించుకుని రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారని వివరించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులతో పాటు, వారికి ప్రత్యేక శిక్షణ అందించిన పీఈటి టి.లహరి దుర్గను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ప్రిన్సిపాల్‌ ఎన్‌.సుబ్రహ్మణ్యంతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భీమడోలులో..

భీమడోలు: జిల్లా అఽథ్లెటిక్స్‌ పోటీల్లో భీమడోలు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభను చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు విద్యార్థులను బుధవారం పాఠశాలలో అభినందించారు. అండర్‌ 16 విభాగంలో దాసరి జయశ్రీలక్ష్మీ 60 మీటర్ల పరుగు పందెం, 600 మీటర్ల పరుగు విభాగాల్లో ప్రథమ స్థానాన్ని సాధించి తమ సత్తాను చాటింది. అండర్‌ 18 విభాగంలో ఎల్‌.రాకేష్‌కుమార్‌ 1000 మీటర్ల పరుగు పోటీల్లో ద్వితీయ స్థానం సాధించగా, అండర్‌ 16 విభాగంలో ఎ.రాజేష్‌ లాంగ్‌ జంప్‌ విభాగంలో ద్వితీయ స్థానాన్ని సాధించాడు. వచ్చే నెల 11, 12, 13వ తేదీల్లో తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని హెచ్‌ఎం జీఎస్‌ పద్మజ తెలిపారు. పాఠశాలకు చెందిన క్రీడాకారులు ఆదిత్య, అఖిల్‌, పవన్‌తేజ, మహీలు జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనుబర్చినందులకు ప్రశంసా పత్రాలను అందించారు. విజేతలకు తర్ఫీదును అందించిన పీడీ పి.త్రిపుర స్వాతి, పి.సురేష్‌బాబు, సోమశేఖర్‌, శ్యాంబాబునాయక్‌లను హెచ్‌ఎం అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement