భీమడోలు: తాగుబోతు భర్త బారి నుంచి ఒక మహిళను భీమడోలు పోలీసులు అత్యంత వేగంగా స్పందించి కాపాడారు. కుటుంబ కలహాల వల్ల దూరంగా ఉంటున్న సీతారత్నాన్ని, ఆమె భర్త రాజు భీమడోలు బస్టాండ్‌లో బెదిరించి బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లాడు. ప్రమాదాన్ని గ్రహించిన ఆమె వెంటనే శక్తి యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. సీఐ వి.కృష్ణ ఆదేశాలతో ఎస్సై మదీనా బాషా ఆధ్వర్యంలో హెచ్‌సీ సూరిశెట్టి శ్రీనివాసరావు, హోంగార్డు పరమేశ్‌లు జీపీఎస్ ఆధారంగా వెంబడించారు. పోలీసులను చూసి రాజు పారిపోవడంతో సీతారత్నాన్ని సురక్షితంగా కాపాడారు. సమయస్ఫూర్తిగా స్పందించి తన ప్రాణాలు కాపాడిన పోలీసులకు బాధితురాలు కృతజ్ఞతలు తెలిపింది.


