చర్యలు తీసుకుంటాం
ఉల్లిక్కిపాటు
తాడేపల్లిగూడెం: మార్కెట్లో ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగి వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వారం రోజులుగా ధరలు ఎగబాకుతుండటంతో, గతంలో లభించిన తక్కువ ధరల విక్ర యాలు ఆగిపోయాయి. ఆదివారం నాటి హోల్‌సేల్ మార్కెట్‌లో సాధారణ రకం ఉల్లి క్వింటాలు రూ.2,800 పలకగా, నాణ్యమైన రకం రూ.3,400 కు చేరింది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.40 కి చేరింది.
మహారాష్ట్ర ఉల్లిపైనే ఆధారం
ప్రస్తుతం దేశీయ మార్కెట్లకు మహారాష్ట్ర ఉల్లిపాయలే ప్రధాన దిక్కుగా మారాయి. నాబార్డు రుణ సదుపాయంతో నిర్మించిన బహిరంగ గోదాముల వల్ల ఇక్కడి ఉల్లి 90 రోజులకు పైగా నిల్వ ఉంటుంది. మార్కెట్ అవసరాలను బట్టి రైతులు సరుకును సరఫరా చేస్తుంటారు. ఈ ఉల్లి పైపొరలపై నల్లమచ్చలు (కాటుక) వచ్చినా కుళ్లిపోవు. అందువల్ల వీటిని ఎక్కువగా వాడతారు. సాధారణంగా ఖరీఫ్, రబీ సీజన్లలో కర్నూలు వంటి ప్రాంతాల నుంచి వచ్చే దిగుబడులు ధరలను అదుపులో ఉంచుతాయి.
కర్నూలుపై ఎల్‌నినో ప్రభావం
కర్నూలులో ఉల్లి పంట 80 శాతం వర్షాధారం. అ యితే ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో సాగు తీవ్రంగా దెబ్బతింది. కర్నూలు జిల్లాలో 19,242 హెక్టార్ల సాగు లక్ష్యానికి కేవలం 2,349 హెక్టార్లలోనే పంట వేశారు. నంద్యాలలో 4,583 హెక్టార్లకు గాను 251 హెక్టార్లలోనే నారు వేశారు. గత సీజన్లలో 7.50 లక్షల టన్నుల దిగుబడి రాగా, అందులో 2.64 లక్షల టన్నులు తెలుగు రా ష్ట్రాలతో పాటు కర్ణాటకకు ఎగుమతి అయ్యేవి. తా డేపల్లిగూడెం మార్కెట్ నుంచి ఈ సరుకు పశ్చిమ బెంగాల్, అసోం, బంగ్లాదేశ్, మలేషియా, ఆఫ్రికా దేశాలకు కూడా ఎగుమతి అయ్యేది. కానీ ఈసారి వానలు లేక రైతులు నారు పోసే పరిస్థితి కూడా లేదు. భవిష్యత్తులో ఉల్లి కొరత మరింత తీవ్రమై, ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వ పాలనలో కై కలూరు నియోజకవర్గంలో ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ శాఖలకు చెందిన ప్రభుత్వ భూములు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో అక్రమార్కులు ప్రభు త్వ స్థలాల్లో శాశ్వత కట్టడాలు నిర్మిస్తూ సొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా కలెక్టర్‌కు స్వయంగా ఫి ర్యాదులు అందుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అక్ర మ నిర్మాణాలకు అడ్డుకట్ట పడటం లేదు.
ప్రధాన కాలువలు, డ్రెయిన్ల కబ్జా
● రాళ్లకోడు కాలువ : ఏలూరు రోడ్డు నుంచి దానిగూడెం మీదుగా సాగునీరు అందించే ఈ కీలకమైన కాలువ స్థలాలు దాదాపు 70 శాతం మేర ఆక్రమణకు గురయ్యాయి. కెనరా బ్యాంకు ఎదురుగా ఇరిగేషన్ భూమిలో రెండంతస్తుల భవ నాన్ని నిర్మిస్తున్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా నిర్మాణం ఆగకపోగా, స్థానికుల రాకపోకలకు వీలుగా కాలువను మట్టితో పూడ్చి ప్రత్యామ్నాయ దారి ఏర్పాటు చేయడం గమనార్హం.
● వర్లకోడు డ్రెయిన్ : కై కలూరులో వరద నీటిని కొల్లేరుకు పంపించే ఈ ప్రధాన డ్రెయిన్‌ను కూడా కబ్జా చేశారు. దీనివల్ల వర్షాల సమయంలో పట్టణంలోని పలు వార్డులు ముంపునకు గురవుతున్నాయి.
● ఆక్వా చెరువుల విస్తరణ : కలిదిండి మండలంలో ఆక్వా రైతులు మరమ్మతుల నెపంతో డ్రెయిన్లను అందినకాడికి ఆక్రమిస్తున్నారు.
కోర్టు ఆదేశాల బేఖాతరు
ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశిస్తున్నా, స్థానిక అధికారులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు. మండవల్లి మండలం భైరవపట్నం శివారు శోభానాద్రిపురం జాతీయ రహదారి పక్కన ఇరిగేషన్ భూమిలో 12 దుకాణాల సముదాయాన్ని నిర్మించారు. అధికారులు కేవలం ‘ఇది ఇరిగేషన్ స్థలం’ అని బోర్డులు పెట్టి చేతులు దులుపేసుకున్నారే తప్ప, దుకాణాలను తొలగించలేదు. పులపర్రులో ఆర్‌అండ్‌బీ భూమిని ఆక్రమించి ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు.
నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు
ఆక్రమణలపై ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు ఒకరిపై ఒకరు నెపం నెట్టేస్తూ కాలయాపన చేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఇరిగేషన్ అధికారులనే మళ్లీ నియమించడంతో, వారు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మూగ ప్రేక్షకులుగా మిగిలిపోయారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులే ఈ ఆక్రమణలపై ఫ్లెక్సీలతో నిరసన తెలపడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.
మండవల్లి మండలం శోభనాద్రిపురంలో ఇరిగేషన్ భూమిలో దుకాణ సముదాయం
కై కలూరు రాళ్లకోడు కాలువ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం
భీమవరం : న్యూ ఆంధ్ర బాడీబిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చేనెల 2న భీమవరం వీరమ్మపార్కు వద్ద చాంపియన్ ఆఫ్ ది చాంపియన్ బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించనున్నట్టు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాసీం తెలిపారు. ఆదివారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో పోటీల బ్రోచర్‌ను డీఎస్పీ రఘువీర్‌విష్ణు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఖాసీం మాట్లాడుతూ పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ట్యా జిల్లాల క్రీడాకారులు పాల్గొంటారన్నారు. విజేతకు రూ.20 వేల నగదు బహుమతి, మిగిలిన విజేతలకు నగదు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందిస్తామన్నారు. రఘువీర్ విష్ణు మాట్లాడుతూ బాడీబిల్డింగ్ శరీర సౌష్టవంతో పాటు క్రమశిక్షణకు దోహదం చేస్తుందన్నారు. అసోసియేషన్ జిల్లా చైర్మన్ దాసి వరప్రసాద్ బాబు, వైస్ ప్రెసిడెంట్ పెన్మెత్స రవివర్మ, పి.అమూల్యరావు, అల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు.
పెరుగుతున్న ఉల్లి ధరలు
కిలో రూ.40
మహారాష్ట్ర పంటే దిక్కు
కూటమి పాలనలో రెచ్చిపోతున్న అక్రమార్కులు
ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ భూముల ఆక్రమణ
రూ.కోట్ల విలువైన స్థలాలు కబ్జా
రాజకీయ నేతల అండ
కుచించుకుపోతున్న పంట కాలువలు
కై కలూరు రాళ్లకోడు కాలువ ఆక్రమణలపై సమాచారం అందింది. దీనిపై విచారణ చేయిస్తాం. ఇరిగేషన్ భూము ల ఆక్రమణలపై ఉన్నతాధికా రులకు నివేదికలు పంపించాం. ఆక్రమణల వద్ద బోర్డులను సైతం ఏర్పాటుచేశాం. ప్రభుత్వ భూములను ఆక్రమించడం నేరం. చర్యలు తీసుకుంటాం.
– డి.శిరీష, ఇరిగేషన్ డీఈఈ, కై కలూరు


