కల్వర్టుల వద్ద మరమ్మతులు | - | Sakshi
Sakshi News home page

కల్వర్టుల వద్ద మరమ్మతులు

Jul 20 2026 1:14 AM | Updated on Jul 20 2026 1:14 AM

కల్వర్టుల వద్ద మరమ్మతులు పీజీఆర్‌ఎస్‌ సేవలపై అభిప్రాయ సేకరణ హాస్టళ్లను సద్వినియోగం చేసుకోండి ఆస్పత్రుల్లో వైద్యుల కొరత సిరులతల్లి.. కల్పవల్లి

భీమడోలు : ‘రోడ్డు నిర్మాణంలో నాణ్యత డొల్ల’ శీర్షికన ఈనెల 17న ‘సాక్షి’లో ప్రచు రించిన కథనానికి అధికారులు స్పందించారు. భీమడోలు వంతెన నుంచి పెదలింగంపాడు వరకు నిర్మించిన రహదారి కల్వర్టుల వద్ద కుంగిపోవడంతో భీమడోలు పీఐయూ శాఖ ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు తమ స్పందన తెలియజేయాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి కోరారు. పీజీఆర్‌ఎస్‌ కేంద్రాలను సందర్శించే పౌరుల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు జి ల్లా, మండల స్థాయి పీజీఆర్‌ఎస్‌ కేంద్రాల్లో, వి విధ మాధ్యమాల్లో క్యూఆర్‌ కోడ్‌ను ప్రదర్శించాలని నిర్ణయించామన్నారు. ఈ క్యూఆర్‌ కోడ్‌ను పీజీఆర్‌ఎస్‌ కేంద్రాల వద్ద ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. అలాగే నోటీసు బోర్డులు, హెల్ప్‌ డెస్క్‌లు, ఫిర్యాదుల కౌంటర్లు తదితర ప్రదేశాల్లో క్యూఆర్‌ కోడ్‌ పోస్టర్లు ఏర్పాటుచేయాలన్నారు.

సాంఘిక సంక్షేమ అధికారి అరుణకుమారి

తాడేపల్లిగూడెం (టీఓసీ): పేద విద్యార్థుల ప్రభుత్వ కాలే జీ వసతి గృహాలను సద్వినియోగం చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్‌వీ అరుణకుమారి అన్నారు. స్థానిక హౌసింగ్‌బోర్డు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర హాస్టల్‌లో ఆదివారం భోజనం ప్లేట్లు, బెడ్‌షీట్లు, నైట్‌ డ్రస్సులు, టవల్స్‌ తదితర వాటిని విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో 35 హాస్టళ్లు ఉన్నాయని, వాటిలో 13 పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్స్‌ అన్నారు. ఇంటర్‌ నుంచి బీటెక్‌ వరకు చదివే పేద విద్యార్థులు వీటిని వినియోగించుకోవాలన్నారు. నరసాపురం, పాలకొల్లు, తణుకు, భీమవరంలో హాస్టళ్లు, పరిమెళ్ల, పెంటపాడు, ఉండి, దర్శిపర్రులో బాలికల హాస్టల్స్‌, ప్రీమెట్రిక్‌ హాస్టళ్లు ఉన్నాయన్నారు. అలాగే తాడేపల్లిగూడెంలో రెండు బాయ్స్‌ కళాశాల హాస్టల్స్‌, బాలికల హాస్టల్‌ ఉన్నాయని, జిల్లాలో 7 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లు కూడా ఉన్నాయన్నారు. అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి బి.రామాంజనేయరాజు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన జిల్లా ఆస్పత్రిలో నెలకొన్న వైద్యులు, మందుల కొరతను తక్షణమే పరిష్కరించాలని ఆర్‌సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి పి.కిషోర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారంస్థానిక ఆర్‌సీపీఐ పార్టీ కార్యాలయంలో జి.శారద అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ వైద్య కళాశాలలో ప్రొ ఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు కలిపి 60 మందికి పైగా ఉండాల్సి ఉండగా ప్రస్తుతం సుమారు 22 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో రో గులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌) : భీమవరం పట్టణ ఇలవేల్పు, భక్తుల పాలిట కొంగు బంగారం మావుళ్లమ్మవారికి ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ మహిళా సభ్యులు ఆదివారం ఆషాఢ సారె సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement