శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

Jul 20 2026 1:14 AM | Updated on Jul 20 2026 1:14 AM

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ఆదివారం సందర్శించారు. కుటుంబసమేతంగా విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు తూర్పు రాజగోపురం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రదక్షిణల అనంతరం ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రా న్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలకగా, దే వస్థానం ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. న్యాయమూర్తి వెంట జిల్లా జడ్జి ఎస్‌.శ్రీదేవి, భీమడోలు కోర్టు జడ్జి ఎస్‌.ప్రియదర్శిని నూతక్కి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement