ఘనంగా యోగాసన పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా యోగాసన పోటీలు

Jul 20 2026 1:14 AM | Updated on Jul 20 2026 1:14 AM

తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమంలో ఆరా ఫౌండేషన్‌, నిత్య సాధన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి యోగాసన పోటీలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన యోగ సాధకులు, క్రీడాకారులు 76 మంది పాల్గొన్నారు. వివిధ విభాగాలలో ట్రెడిషనల్‌, ఆర్టిస్టిక్‌ సోలో, పెయిర్‌, రిథమిక్‌ పెయిర్లలో ఈ పోటీలు జరిగాయి. యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు, కార్యదర్శి కరిబండి రామకృష్ణ, గౌరవాధ్యక్షులు వింజుమూరి మాధవరావు, ఏపీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మండూరు వెంకట రమణ పర్యవేక్షించారు. న్యాయ నిర్ణేతలుగా కర్రి భువనేశ్వరి, బొజ్జ లక్ష్మి వెంకట సాయి, టీజేవీఎస్‌ భారతి, సయ్యద్‌ యాసిన్‌, మోహిద్దీన్‌, శ్రీనివాసరావు, రామచక్రధరరావు, దుర్గాభవానీ, రామచంద్రరెడ్డి వ్యవహరించారు. విజేతలు వచ్చే నెలలో జరిగే రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలకు అర్హత సాధించారు. వివిధ కేటగిరీలలో పి. అభినందని, పి.హాసిని, కె.కృష్ణహర్షిణి, పి.చిరంజీవి, వి.గురు ప్రసాద్‌, ఎన్‌.రాజేష్‌, కార్తీక ఉషశ్రీ దుర్గ, సీహెచ్‌ సీతారామ భరత్‌, కె.వాసంతి, టి.లక్ష్మి, బి.శిరీష, సీహెచ్‌ హేమలత, ఎస్‌.అమల, ఎం.సుభద్ర, బి.రేణుక, ఎ.సుభాషిణి విజేతలుగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement