క్రీడలను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడలను ప్రోత్సహించాలి

Jul 20 2026 1:14 AM | Updated on Jul 20 2026 1:14 AM

భీమవరం: పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే దేశానికి మంచి క్రీడాకారులు అందించిన ఘనత వారికి దక్కుతుందని సీఆర్‌డీఏ అడిషనల్‌ కమిషనర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 17 నుండి మూడు రోజులపాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సాగి రామకృష్ణంరాజు మెమోరియల్‌ బ్యాడ్మింటన్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ సెలక్షన్స్‌ కమ్‌ ఛాంపియన్‌షిప్‌ 2026 పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాహుల్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారుల ప్రతిభ చూస్తుంటే అబ్బురపరుస్తోందని, అండర్‌ లెవల్‌లో కూడా మంచి పట్టుదలతో ఆడి విజయాలు అందుకున్న విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం తరఫున రాహుల్‌ కుమార్‌ రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌, క్రీడల ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ డాక్టర్‌ సీహెచ్‌ హరిమోహన్‌ అధ్యక్షత వహించారు. కళాశాల సెక్రటరీ అండ్‌ కరెస్పాండెంట్‌ సాగి రామకృష్ణ నిషాంత్‌ వర్మ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా క్రీడలకు తమ కళాశాల వేదికగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement