భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక డీమార్ట్ ఎదురుగా స్వప్న వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల మహోత్సవంలో భాగంగా కలశాలతో ఊరేగింపు నిర్వహించారు.
కై కలూరు: ప్రతి కార్యకర్త పార్టీతో నేరుగా అనుసంధానమయ్యే అవకాశం జగన్ 2.0 సూపర్ యాప్ కలిగిస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో యాప్ పోస్టర్‌ను శనివారం ఆయన విష్కరించారు. అనంతరం డీఎన్నార్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల గొంతుకను అణచివేసే ప్రయత్నాలను తిప్పికొట్టడంతోపాటు సమాచార మార్పిడి, ప్రజా సమస్యలు, పోలీసు, రాజకీయ వేదింపులపై డిజటల్ డైరీ ద్వారా నేరుగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తోందన్నారు. పార్టీ యాప్‌లో మన భావాలను నేరుగా పంచుకునే అవకాశం ఉంటుందన్నారు. కై కలూరు నియోజకవర్గంలో వివిధ పార్టీ పదవులు పొందిన కార్యకర్తలు, నాయకుల సంఖ్య 18,500 ఉందన్నారు. ప్రతి ఒక్కరూ యాప్‌ను సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. అనంతరం పలువురితో ఆయన యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ముదిరాజుల సంఘ విభాగ అధ్యక్షుడు కోమటి విష్ణువర్థనరావు, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు మహమ్మద్ సర్వర్, నాలుగు మండలాల సోషల్ మీడియా అధ్యక్షులు శొంఠి చిన్నా, మోగనాటి గడియోన్, చాబత్తిన వినోద్, రాంశ్రీ మహేష్, జిల్లా నాయకులు పేర్ని పృథ్వి, మనిమిల్లి రాజేష్, వల్లూరి చైతన్య వర్మ, పండు రవిరాజు, దండే రవిప్రకాష్ పాల్గొన్నారు.


