కలిదిండి(కై కలూరు): కలిదిండి మండలం వెంకటాపురంలో శనివారం జరిగిన ఘటనలో ఒక కూలీ ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన పంచకర్ల వెంకన్న (49) పాతబావిని పూడ్చే పనిలో ఉండగా, మోటారు ద్వారా నీటిని తోడుతుండగా కాలు జారి మోటారును పట్టుకోవడంతో షాక్‌కు గురై బావిలో పడి మృతి చెందాడు. అతడి కుమారుడు బాజీబాబు ఫిర్యాదు మేరకు కలిదిండి ఎస్సై పవన్‌కుమార్ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దెందులూరు: ప్రమాదవశాత్తూ చెరువులో పడి రెండో తరగతి విద్యార్థి మృతి చెందాడని దెందులూరు ఎస్సై డి.వెంకట్‌కుమార్ తెలిపారు. పోతునూరుకి చెందిన నిదునూరి దుర్గారావు కుమారుడు యేసుబాబు శుక్రవారం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఆడుకోవడానికి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో బంధువులు వెతకగా, సమీపంలోని చెరువులో ఉన్న పడవలో ఆడుకుంటున్నాడని స్థానికులు తెలపడంతో గాలించారు. రాత్రి 11:30 గంటలకు యేసుబాబు మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ స్పోర్ట్స్: విశాఖలోని అక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 11వ రాష్ట్ర అంతర్ జిల్లాల సబ్‌జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ శనివారం ప్రారంభమైంది. కేటగిరీ–2 బాలుర 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో ఏలూరుకు చెందిన స్వామినాయుడు విజేతగా నిలిచారు.


