పవర్‌ఫుల్‌గా వినియోగం | - | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌గా వినియోగం

May 29 2026 2:31 AM | Updated on May 29 2026 2:31 AM

రికార్డు స్థాయిలో 9.7 మిలియన్‌ యూనిట్ల వాడకం

రికార్డు స్థాయిలో 9.7 మిలియన్‌ యూనిట్ల వాడకం

దెందులూరు: మండుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతుండగా.. వేసవి తాపాన్ని తాళలేక ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్‌ వాడకం రికార్డుస్థాయిలో నమోదవుతోంది. గృహావసరాలతో పాటు పారిశ్రామిక, వ్యవసాయ, వాణిజ్య ఆధారిత రంగాల్లో విద్యుత్‌ వాడకం గణనీయంగా పెరుగుతోంది.

గృహ వినియోగమే ఎక్కువ

గృహావసరాలకే ఎక్కువగా విద్యుత్‌ వినియోగిస్తున్నట్టు ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఉక్కపోత కారణంగా కనిపిస్తోంది. గత నాలుగు రోజుల్లో పరిశీలిస్తే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అధిక విద్యుత్‌ వినియోగం జరుగుతున్నట్టు చెబుతున్నారు. జిల్లాలో రికార్డు స్థాయిలో ఒక్కరోజులో 9.77 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగించినట్టు అధికారులు తెలిపారు.

అప్రకటిత కోతలు

అధికారులు విద్యుత్‌ కోతలు లేవని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పలు ప్రాంతాల్లో ఉదయం, రాత్రి వేళల్లో గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంద నే ఆందో ళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఏసీ లు, కూలర్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. రెండు రోజులుగా ఏలూరులో పాటు పట్టణాల్లోని షోరూమ్‌లు వినియోగదారులతో కళకళలాడుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement