జిల్లా సమాచారం
తోడ్పాటు అందించాలి
సమస్యలు పరిష్కరించాలి
దెందులూరు: జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులకు ప్రోత్సాహం కరువైంది. మొక్కల సంరక్షణకు సంబంధించి ఏడాదిగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో పలువురు రైతులు తమ పొలాల్లో కొబ్బరి, ఆయిల్‌పామ్, నిమ్మ, జీడిమామిడి, మామిడి, సపోటా, జామ, దానిమ్మ వంటి మొక్కలను నాటారు. మొక్కలు నాటేంత వరకూ ఒత్తిడి చేసిన అధికారులు అనంతరం వీటి సంరక్షణకు ప్రోత్సాహాన్ని మరిచిపోయారు. ఏడాదికి పైగా రైతులు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ ఎవరూ తిరుగుతు న్నా పట్టించుకోవడం లేదు.
మూడేళ్ల పాటు..
ఉద్యాన పంటల సాగుకు సంబంధించి మొక్క ఎంపిక నుంచి నాటుకుని పంట చేతికొచ్చే వరకూ మూడేళ్లకు అయ్యే ఖర్చు నూరు శాతం ప్రభుత్వం భరిస్తుంది. దీనికి సంబంధించి ప్రతినెలా బిల్లులు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో 1,984 మంది రైతులు 3,500 ఎకరాల్లో 3,29,346 మొక్కలు నాటారు. మొక్కల రవాణా, నాటించడం, ఎరువులు, పురుగు మందుల పిచికారీ వంటి ఖర్చులు రైతులు భరించారు. వీటికి సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో రైతులకు మొక్కలు తెచ్చుకొని, గుంతలు పాతిన స్థితికి రూ.3,39,82,000ను ప్రభుత్వం చెల్లించింది. మొక్కల పెంపకం, ఇతర ఖర్చులు, వేతనం, సామగ్రి కింద సుమారు రూ.25 లక్షల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీనిపై జాతీయ ఉపాధి పథకం (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట సుబ్బారావును వివరణ అడగ్గా ఉద్యాన పంటల సాగుకు తగు ప్రాధాన్యమిస్తున్నామని, త్వరితగతిన బిల్లులు చెల్లిస్తామని చెప్పారు.
మండలాలు 27
పంచాయతీలు 549
సాగు ఎకరాలు 3,500
రైతులు 1,984
సాగు చేస్తున్న మొక్కలు 3,29,346
‘ఉపాధి’ ఉద్యాన పంటల సాగు
రైతులకు అందని బిల్లులు
ఏడాదిగా మెటీరియల్ బకాయిలు
జిల్లాలో రూ.25 లక్షల వరకు బిల్లుల పెండింగ్
జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు తోడ్పాటు ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో మరింత అవగాహన కల్పించాలి. సాగు ప్రారంభం నుంచి చివరి వరకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలి.
– ఆళ్ల సతీష్‌చౌదరి, రైతు నాయకులు
ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కరించాలి. ఉద్యాన సాగు కు ప్రోత్సాహం క్రమం తప్పకుండా ఇవ్వాలి. ఎప్పటికప్పు డు సాయం చేస్తూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా అండగా ఉండాలి.
– తట్టుకోళ్ల శ్రీనివాసరావు, రైతు


