అటవీ ఫలసాయం.. అంతంతమాత్రం | - | Sakshi
Sakshi News home page

అటవీ ఫలసాయం.. అంతంతమాత్రం

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

ఆసక్తి తగ్గింది

బుట్టాయగూడెం: అడవిపై ఆదివాసీ గిరిజనుల జీవనాధారం క్రమేపీ తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు గిరిజనులకు ఎంతో ఆసరాగా నిలిచిన అటవీ ఉత్పత్తులు నేడు నామమాత్రంగానే లభిస్తున్నాయి. రానురాను అటవీ ఫలసాయం తగ్గుతూ కొన్నిరకాలు మాత్రమే లభించడంతో గిరిజనులు అడవిబాట పట్టడం తగ్గిస్తున్నారు. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకూ తిరిగినా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఏటా వేసవిలో సహజసిద్ధంగా లభించే అటవీ ఉత్పత్తులను గిరిజనులు సేకరించి గిరిజన సహకార సంస్థ (జీసీసీ)కి విక్రయిస్తారు. అయితే గతంలో మాదిరిగా అటవీ ఉత్పత్తుల సేకరణపై ప్రస్తుతం గిరిజనులు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. యువత ఆసక్తి చూపకపోగా.. ముందు తరం వారు మాత్రమే ఫలసాయం సేకరించేందుకు వెళుతున్నారు.

ఆశించిన ధర లేక.. డిమాండ్‌ రాక

ప్రస్తుత విదేశీ అటవీ ఉత్పత్తుల తయారీ రంగంలో అంతర్జాతీయంగా డిమాండ్‌ తగ్గడంతో అటవీ ప్రాంతంలో సేకరించిన ఉత్పత్తుల ను కొనుగోలు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. టెండర్లు కూడా నిలిచిపోవడంతో సేకరించిన అటవీ ఉత్పత్తులకు గిరిజనులు ఆశించిన స్థాయిలో ధర రాకపోవడంతో అటవీ ఉత్పత్తుల సేకరణపై నిరాసక్తత చూ పుతున్నారు.

రూ.8 లక్షల వరకు కొనుగోళ్లు

గతేడాది నుంచి ముషిణి గింజలు, నరమా మిడి చెక్క, తిప్పతీగ, షీకా కాయలకు ధర పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ సుమారు రూ.8 లక్షల వరకూ ఉత్పత్తులు కొనుగోలు చేసినట్టు జీసీసీ అధికారులు తెలిపారు. పెరిగిన ధర ప్రకారం ముషిణి గింజలు కిలో రూ.100 చొప్పున 80 కింటాళ్ల వరకూ కొనుగోలు చేశారు. నరమామిడి చెక్క కిలో రూ.20 చొప్పున 10 క్వింటాళ్లు, తిప్పతీగ కిలో రూ.11 చొప్పున 75 క్వింటాళ్లు, షీకాకాయలు కిలో రూ.55 చొప్పున 100 కిలోల వరకూ కొన్నట్టు జీసీసీ అధికారులు తెలిపారు.

అడవి ఉత్పత్తుల చెట్లు పెంచాలి

అటవీ ప్రాంతంలో క్రమేపీ తగ్గుతున్న అటవీ ఉత్పత్తుల చెట్లను పెంచేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని గిరిజనులు కోరుతు న్నారు. గతంతో పోలిస్తే అటవీ ఫలసాయ మొక్కల నుంచి ఉత్పత్తులు తగ్గిపోయాయని ముఖ్యంగా పశ్చిమ ఏజెన్సీలో ఇప్పపువ్వు, నరమామిడి చెక్క, తప్సి జిగురు, ఇప్పపరక, కరక్కాయలు వంటి చెట్లు కూడా నామమాత్రంగా ఉన్నాయని అంటున్నారు. ఆయా చెట్లను పెంచడం ద్వారా తమకు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

క్రమంగా తగ్గుతున్న అటవీ ఉత్పత్తులు

సేకరించేందుకు గిరిజనుల నిరాసక్తత

కొన్నిరకాలే కొంటున్న జీసీసీ

ఇప్పటివరకూ రూ.8 లక్షల విలువై న ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు

గతంలో మాదిరిగా గిరిజనులు అటవీ ఉత్పత్తుల సేకరణపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గిట్టుబాటు ధర రావడం లేదని చెబుతున్నారు. గతేడాది నుంచి అటవీ ఉత్పత్తుల కొనుగోలుపై గిరిజనులకు అవగాహన కలిగిస్తున్నాం.ఈ ఏడాది రూ.8.17 లక్షల విలువైన ఉత్ప త్తులు కొనుగోలు చేశాం. అటవీ ఉత్పత్తుల కొనుగోలుపై గిరిజనులకు మరింత అవగాహన కల్పించి జీసీసీలో విక్రయాలు పెంచేలా కృషి చేస్తాం.

– చెరుకూరి రాజియోగి,

జీసీసీ సీనియర్‌ మేనేజర్‌, కేఆర్‌పురం

Advertisement
 
Advertisement
Advertisement