అల్లూరులో ఆరకమణల జోరు | - | Sakshi
Sakshi News home page

అల్లూరులో ఆరకమణల జోరు

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

అల్లూరులో ఆరకమణల జోరు ఫిర్యాదు చేస్తాం

దేవస్థానం, ఆర్‌అండ్‌బీ భూముల్లో పాగా కూటమి నేత అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో దేవస్థాన భూములకు రక్షణ కరువయ్యింది. అలాగే ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కనే అక్రమార్కులు పాగా వేస్తున్నారు. పబ్లిక్‌గా పరజాలు అడ్డుపెట్టి మరీ అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నా ప్రభుత్వాధికారులు పట్టించుకోవడం లేదు. కై కలూరు నియోజకవర్గంలో ఇప్పటికే అర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, దేవస్థాన భూములను పలువురు కబ్జాలు చేసి షాపింగ్‌ కాంప్లెక్సులు కట్టేశారు. ఈ తంతూ నియోజకవర్గం మొత్తం పాకింది.

పురాతన దేవస్థానం భూముల్లో..

ముదినేపల్లి మండలం అల్లూరులో పురాతన పార్వతీ సమేత సోమేశ్వరస్వామి దేవస్థానం ఉంది. దేవస్థానానికి పూర్వం దాతలు 3.79 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. దేవస్థానం నుంచి ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు, రోడ్డు దాటిన తర్వాత పొలాలు దేవస్థానం భూములుగా ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం రోడ్డుకు కుడివైపున దేవస్థాన భూమిలో కొందరు నివాసాలు, దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. దేవదాయశాఖ కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు ప్రకారం నెలకు రూ.1,000 చొప్పున అద్దెను ఆక్రమణదారులు దేవస్థానానికి చెల్లిస్తున్నారు. వీటిని ఎప్పటికై నా తొలగించే అవకాశం ఉంది.

పరదాలు కట్టి మరీ..

రోడ్డుకు ఎడమ వైపున బస్టాండ్‌, ఆంజనేయస్వామి ఆల యం ఉంది. దీని వెనుక దేవస్థానం పంట భూములు ఉ న్నాయి. ఓ వ్యక్తి దేవస్థాన భూమిలో ఏకంగా ఇంటి నిర్మాణానికి ప్రయత్నిస్తే రెండు రోజుల క్రితం ఆలయ ఈఓ శింగనపల్లి శ్రీనివాసరావు, రెవెన్యూ, పోలీసు అధికారులతో వెళ్లి వాటిని తొలగించారు. అలాగే చాలా మంది ఆర్‌అండ్‌బీ రోడ్డు సమీపంలో పరదాలు కట్టుకుని మరీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వాస్తవానికి ఆక్రమణదారులు పంట బోదెను సైతం పూడ్చివేశారు. ఇదే రోడ్డుకు చివరన కూటమి నేత అండతో కబ్జా చేయడానికి ప్రయత్నించి మీడియాలో అల్లరవ్వడంతో ఆ ప్రాంతంలో దేవస్థానం పేరుతో చలివేంద్రం ఏర్పాటుచేశారు. ఇటు ఆర్‌అండ్‌బీ దాని సమీపంలో దేవస్థాన భూమిని కొట్టేయడానికి శతవిధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోడ్డు సమీపంలో ప్రైవేట్‌ భూములు సెంటు రూ.80 వేలు ధర పలుకుతోందని అంచనా.

ఆక్రమించుకోండి.. అండగా ఉంటాను

అక్రమార్కులకు గ్రామంలో ఓ కూటమి నేత అండగా ఉన్నాడు. దేవస్థానం భూములు ఆక్రమించుకున్న జాబితాలో అతడి బంధువులు ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే మరింత చెలరేగి పోయి ఆక్రమణలకు ఆజ్యం పోస్తున్నాడు. గ్రామంలో వర్గాలుగా విభజించి పెత్తనం చెలాయిస్తున్నాడు. అధికారపక్ష నేతలతో అంటకాగడంతో అధికారులు సైతం అతడికి అడ్డు చెప్పలేకపోతున్నారు. ఏకంగా దేవస్థాన భూమిలో సైతం సంక్రాంతికి పేకాట, కోడిపందాలు జరుగుతుంటే ఏం చేయలేని పరిస్థితిలో అధికారులు చూస్తున్నారు.

అల్లూరు దేవస్థానం భూమి కోర్టులో ఉండగా ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి ప్రయత్నించాడు. రెవెన్యూ, పోలీసు సహకారంతో తొలగింపజేశాం. పంట బోదె, డ్రెయిన్లనూ ఆక్రమిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు ఈ విషయంపై దేవస్థానం తరఫున ఫిర్యాదు చేస్తాం. దేవస్థాన భూముల్లో ఆక్రమణలను అడ్డుకుంటాం.

– శింగనపల్లి శ్రీనివాసరావు, సోమేశ్వర దేవస్థానం ఈఓ, అల్లూరు

Advertisement
 
Advertisement
Advertisement