ఖాకీల కాఠిన్యం | - | Sakshi
Sakshi News home page

ఖాకీల కాఠిన్యం

Apr 9 2026 8:35 AM | Updated on Apr 9 2026 8:35 AM

గోదావరి మోక్షధామం

న్యూస్‌రీల్‌

ఎస్సై కొట్టాడని యువకుడి ఆత్మహత్య

గోదావరి మోక్షధామం
పెనుగొండ: సిద్ధాంతం కేదారీఘాట్‌లోని శ్మశాన వాటికలో రూ.3 కోట్లతో 62 సెంట్ల విస్తీర్ణంలో గోదావరి మోక్షధామం నిర్మాణానికి కలెక్టర్‌ నాగరాణి శ్రీకారం చుట్టారు.

గురువారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రశాంతతకు మారుపేరైన జిల్లాలో పోలీస్‌ శాఖ గాడి తప్పుతుంది. సామాన్యులపై ఖాకీలు నిత్యం ప్రతాపం చూపిస్తూ లాఠీ ట్రీట్‌మెంట్‌తో హడలెత్తిస్తున్నారు. తరచూ జిల్లాలో ఇటువంటి ఘటనలు చేసుకుంటున్నా.. సెటిల్‌మెంట్లతో తెరమరుగు చేస్తుండడం గమనార్హం. తాజాగా బుట్టాయగూడెం ఎస్సై దుర్గా మహేశ్వరరావు యువకుడ్ని చితకబాదడం, నిడమర్రు ఎస్సై రమేష్‌ ఓ వ్యక్తిని కొట్టడంతో అవమానంగా భావించి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈ రెండు ఘటనల్లో ఇద్దరు ఎస్సైలను సస్పెండ్‌ చేశారు. అనంతరం పూర్తి స్థాయి విచారణ నిర్వహించి ఇద్దరు ఎస్సైలను వీఆర్‌కు పంపడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

లాఠీ ట్రీట్‌మెంట్‌ : జిల్లాలో ఖాకీలు సామాన్యులపై ప్రతాపం చూపుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీకి తలొగ్గి అడ్డగోలుగా కేసులు నమోదు చేయడం, ప్రజాప్రతినిధుల ఆదేశాలంటూ బాధితులకు న్యాయం చేయకుండా కక్షపూరిత ధోరణికి పరోక్షంగా మద్దతు పలకడం, కొన్ని సందర్భాల్లో హైకోర్టు ఉత్తర్వుల ధిక్కరణకు పాల్పడుతూ తరచూ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. కొన్ని పొలిటికల్‌ కేసుల్లో న్యాయమూర్తులు ఎస్సైలను మందలించడం, మెమోలు జారీ చేయాలని ఉత్తర్వులిచ్చిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అయినా పోలీసులు అదే ధోరణిలో కొనసాగడం చర్చగా మారింది.

రాధాకృష్ణ వ్యాఖ్యలపై కన్నెర్ర

నిడమర్రుకు చెందిన నండూరి శివ కార్తికేయ (33) తన మేనకోడలు గొలుసు పోవడానికి అదే గ్రామానికి చెందిన వ్యక్తి కావడమని ఆరోపించడంతో ఆ రెండు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. గత నెల 30న నిడమర్రు పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాల ఫిర్యాదులను కేసులుగా నమోదు చేశారు. ఈ క్రమంలో నిడమర్రులో కల్యాణోత్సవాల బందోబస్తుల్లో విధుల్లో ఉన్న ఎస్సైను.. కేసు నమోదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని శివకార్తీకేయ ప్రశ్నించాడు. దీంతో ఎస్సైకు కోపం కట్టలు తెంచుకుంది. ఇదే సమయంలో తిరునాళ్లలో బాలాజీ అనే వ్యక్తి కత్తి తిప్పి పరారీ అయ్యాడు. దీంతో కల్యాణోత్సవం వద్ద, అనంతరం స్టేషన్‌లో ఎస్సై విచారణ పేరుతో శివకార్తీకేయను తీవ్రంగా కొట్టి అవమానించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో కార్తీకేయ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తణుకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివకార్తీకేయకు పోలీస్‌ బందోబస్తు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందాడు. ఈ ఘటనలో పోలీసులేమి వేధించలేదని నడిరోడ్డుపై పోలీసులను దుర్భాషలాడితే అదుపులోకి తీసుకుని స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి ఇంటికి పంపించామని డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ ప్రకటించారు. అయితే ఎస్సైను మాత్రం వీఆర్‌కు పంపడం ఈ కేసులో ప్రత్యేకం.

జిల్లాలో గాడి తప్పిన పోలీసింగ్‌

అకారణంగా యువకుడిని గాయపరిచిన బుట్టాయగూడెం ఎస్సై

నిడమర్రు ఎస్సై కొట్టడంతో మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

ఇద్దరు ఎస్సైలు వీఆర్‌కు..

గతంలోనూ ఇదే తరహా ఘటనలు జిల్లాలో అనేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement