బుట్టాయగూడెం ఎస్సై దుర్గామహేశ్వరరావు జంగారెడ్డిగూడెంకు చెందిన అఖిల్ అనే యువకుడ్ని చితకబాదారు. గత నెలలో రెడ్డిగణపవరంలో జరిగిన తిరునాళ్లలో అఖిల్ అనే యువకుడిని ఎస్సై గట్టిగా కొట్టడంతో రెండు చేతులు విరిగిపోయాయి. పొలిటికల్ నేతలు రంగప్రవేశం చేసి కేసు రాజీకి ప్రయత్నించారు. అయినా యువకుడు బంధువులు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఎస్సైను వీఆర్‌కు పంపారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం చర్చనీయాంశంగా మారింది. మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇలాంటి ఘటనలు జరిగిన తరువాత బాధిత కుటుంబాలతో రాజకీయ, ఇతరాత్ర ఒత్తిళ్లు తీసుకువచ్చి సర్దుబాటు చేసుకోవడం విశేషం.


