ఏలూరు (టూటౌన్): ఎల్‌నినో ప్రభావంతో పంటల దిగుబడులు తగ్గకుండా ఉండేందుకు రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా చెప్పారు. స్థానిక ఐఏడీపీ హాల్లో బుధవారం ప్రకృతి వ్యవసాయ అమలుపై 3వ రోజున 154 మంది కేడర్‌కు విస్తృత స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్కే హాబీబ్ బాషా, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బి.వెంకటేష్ ఎల్‌నినో ప్రభావంతో పంటల దిగుబడులు తగ్గకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు.


