భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి

Apr 9 2026 8:35 AM | Updated on Apr 9 2026 8:35 AM

అన్నదాన భవనానికి విరాళం భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి

అన్నదాన భవనానికి విరాళం
కాళ్ల: కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అన్నదానం నిమిత్తం కోలనపల్లికి చెందిన గ్రంధి వెంకటేశ్వర్లు, జ్ఞాన ప్రసన్న రూ.1,11,111 విరాళం అందించారు.

ఏలూరు (టూటౌన్‌): పోలవరం ప్రాజెక్ట్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలకు భూసేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి బుధవారం సాయంత్రం పోలవరం ప్రాజెక్టు ఆర్‌అండ్‌ఆర్‌ పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారుల నిర్మాణానికి, ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు, చింతలపూడి ఎత్తిపోతల పథకం, సెల్‌ ఫోన్‌ నెట్వర్క్‌ టవర్ల ఏర్పాటు, తదితర కార్యక్రమాలకు భూ సేకరణపై అధికారులతో వీడియో కాన్షరెన్స్‌ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు నిర్మించే కాలనీలకు సంబంధించి భూసేకరణ పనులను వెంటనే పూర్తిచేసి, కాలనీ నిర్మాణ ఏజెన్సీలకు అప్పగించాలని ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణ భూసేకరణ పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూసేకరణ చేయాల్సిన భూ విస్తీర్ణం వివరాలతో నివేదిక సమర్పించాలని, భూసేకరణ పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు భూసేకరణ పనులను వేగవంతం చేయాలని, దెందులూరు నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు సెరికల్చర్‌ భూమి సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, నూజివీడు నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కునకు భూసేకరణకు భూమిని వెంటనే గుర్తించాలని అన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ, ఇన్‌చార్జి డీఆర్‌ఓ భాస్కర్‌, పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌ అభిషేక్‌, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బి.వినూత్న, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓలు కిషోర్‌, రమణ, కలెక్టరేట్‌ భూసేకరణ విభాగ అధికారి పోతురాజు, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement