ఏలూరు టౌన్: ఓటరు జాబితా సవరణలో జరుగుతున్న అవకతవకలపై ప్రతి బూత్ కమిటీ సభ్యుడు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి అన్నారు. బూత్ కమిటీ రీజనల్ కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు చింత అనిల్ ఆధ్వర్యంలో ఏలూరులో జిల్లా స్థాయి బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్ల జాబితాలో సవరణపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పార్టీ నేతలకు, బూత్‌కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పేరుతో ఓట్ల సవరణలో ఏవిధంగా ఓట్లను భారీఎత్తున తొలగించారో చూశామన్నారు. ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియపై ప్రతి బూత్ కమిటీ సభ్యుడు అవగాహన చేసుకుంటూ రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, పీఏసీ సభ్యులు, ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, పోలవరం సమన్వయకర్త తెల్లం బాలరాజు, చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, కై కలూరు, చింతలపూడి, ఏలూరు పరిశీలకులు నూకపెయ్యి సుధీర్‌బాబు, దాసరి రమేష్, డీవీఆర్‌కే చౌదరి, పార్టీ నేతలు, బూత్‌కమిటీ సభ్యులు హాజరయ్యారు.


