గర్భిణుల ప్రాణాలతో చెలగాటం
ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని మాతాశిశు విభాగంలో గర్భిణుల ప్రాణాలతో వైద్య సిబ్బంది చెలగాటం ఆడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 8లో u
కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కన్నతల్లి చనిపోయి, తండ్రి వదిలేసిన అనాథ బాలలు ముగ్గురిని కలెక్టర్ వెట్రిసెల్వి అక్కున చేర్చుకున్నారు. కుక్కునూరు చెందిన ఏడు, ఆరు, నాలుగు సంవత్సరాల వయసు కలిగిన ముగ్గురు బాలికల తల్లి ఇటీవల మరణించింది. తండ్రి పిల్లలను వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు లేక దీనస్థితిలో ఉన్న వారి పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కలెక్టర్ వెట్రిసెల్వి ఆ పిల్లల పరిస్థితిని పరిశీలించి తీసుకురావాల్సిందిగా ఐసీడీఎస్ పీడీ శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి సీహెచ్ సూర్య చక్రవేణిలను ఆదేశించారు. కలెక్టరేట్‌కు తీసుకువచ్చిన ఆ బాలికలతో కలెక్టర్ వెట్రిసెల్వి కొంతసేపు మాట్లాడారు. వారికి కొత్త బట్టలు, చెప్పులు, బిస్కెట్లు, డ్రాయింగ్ పుస్తకాలు, కలర్ పెన్సిల్‌లు నోట్ బుక్స్ ఇచ్చి, తదుపరి చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సూర్య చక్రవేణికి ఆదేశాలు జారీ చేశారు.


