ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో తలెత్తుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జాక్టో నాయకులు మంగళవారం జిల్లా విద్యాశాఖాధకారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాక్టో జిల్లా చైర్మన్ పువ్వుల ఆంజనేయులు మాట్లాడుతూ మూల్యాంకన కేంద్రంలో స్థిరమైన, వేగవంతమైన నెట్‌వర్క్ సదుపాయం కల్పించాలని, ట్యాబ్ పరికరాల నాణ్యత, పనితీరును సమగ్రంగా సమీక్షించాలని డిమాండ్ చేశారు. మూల్యాంకన కేంద్రంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, స్పెషల్ అసిస్టెంట్‌లకు తీవ్ర ఇబ్బందుల విషయంలో సాంకేతిక సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. సిబ్బందికి రెమ్యూనరేషన్ పెంచాలని కోరారు.


