జంకుతున్న జయమంగళ.. | - | Sakshi
Sakshi News home page

జంకుతున్న జయమంగళ..

Apr 8 2026 7:14 AM | Updated on Apr 8 2026 7:14 AM

జంకుతున్న జయమంగళ..

ముచ్చటగా మూడో పార్టీలో కొనసాగుతోన్న ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీని దూకుడుగా తీసుకెళ్లడానికి జంకుతున్నారు. నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన జయమంగళ, వైఎస్సార్‌సీపీ పాలన చివరిలో పార్టీలో చేరారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొల్లేరు ప్రాంత బిడ్డకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. తీరా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన జనసేన పార్టీలో చేరారు. చుక్కాని లేని నావగా మారిన జనసేన పార్టీకి జయమంగళ రావడంతో పవన్‌ కల్యాణ్‌ సామాజికవర్గంతో పాటు బీసీలు పార్టీకి అండగా ఉంటారని అందరూ భావిం చారు. కానీ సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఇప్పుడు టీటీడీ బ్రేక్‌ దర్శనాల సిఫార్సుల లెటర్లకే ఎమ్మెల్సీ పరిమితమయ్యారు. అధికారులు సైతం ఎమ్మెల్సీని లెక్కచేయడం లేదు. ప్రోటోకాల్‌ లేదు. ఎమ్మెల్యే కామినేనితో ఎమ్మెల్సీ జయమంగళ కలసి కార్యక్రమాల్లో పాల్గొనడం వేళ్ల మీద లేక్కేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement