పాలకొల్లు సెంట్రల్: సాగునీటి సంఘాల అధ్యక్షుల సమన్వయంతో మురుగు కాలువలు ప్రక్షాళణ చేసే దిశగా చర్యలు చేపడతామని డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ పెన్మెత్స రామభద్రరాజు అన్నారు. మంగళవారం సాగునీటి సంఘాల అధ్యక్షులు, అధికారులతో స్థానిక డ్రెయినేజీ శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఈ సీహెచ్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 15 నాటికి ప్రధాన కాలువలకు నీటి కట్టడం జరుగుతుందన్నారు. అనంతరం మురుగు కాలువల ప్రక్షాళనపై చర్యలు చేపడతామని చెప్పారు. వీటి బాధ్యతను సాగునీటి సంఘ అధ్యక్షులు చేపడతారని తెలిపారు. గతంలో ఉన్న రేట్లకు పని చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని అన్నారు. కార్మికుల వేతనాల పెంపుపై ఉన్నతాధికారులతో మాట్లాడతామని చెప్పారు. కార్యక్రమంలో ఏఈఈలు ఎ.దుర్గాప్రసాద్, జి.సతీష్, బి.సాయిశాంతం, సాగునీటి సంఘాల అధ్యక్షులు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, ఇంటి శ్రీరాములు, ఆరుమిల్లి రామశ్రీనివాస్, దేవరపు దొరబాబు, దేవళ్ల మోహన్, మాతా రత్నరాజు, కుక్కల సత్యనారాయణ, పులంకడం రాఘవులు, టి.వెంకట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


